OG: రజనీకాంత్ కు భాషా పవన్ కళ్యాణ్ కు ఓజీ.. బాక్సాఫీస్ అమ్మ మొగుడు పవన్ అనేలా?

OG: సూపర్ స్టార్ రజినీకాంత్ తాజాగా నటించిన చిత్రం జైలర్. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా అన్ని భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుని కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతోంది. కాగా మాఫియా బ్యాక్ డ్రాప్ ఉన్న సినిమాల తీస్తే అందులో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన జైలర్ చిత్రం టాప్ స్థానంలో ఉంటుంది. అయితే ఈ చిత్రం అప్పట్లో సౌత్ లో సృష్టించిన సునామి గురించి ఎంత చెప్పినా అది తక్కువే అవుతుంది. అప్పటి వరకు కేవలం తమిళ సినిమా ఇండస్ట్రీకి మాత్రమే పరిమితమైన రజినీకాంత్ మార్కెట్,క్రేజ్ ఈ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ కి వెళ్ళింది.

ఏ హీరో అయినా మాఫియా బ్యాక్ డ్రాప్ సినిమా తీస్తే బాషా చిత్రంతో పోల్చుకుంటారు. అయితే ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఓజీ చిత్రం కూడా ఆయన కెరీర్ లో అలాంటి బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అంటున్నారు. ఈ చిత్రంలో కేజీఎఫ్ కి మించిన ఎలివేషన్ సన్నివేశాలు ఉంటాయట. వాటితో పాటుగా గుండెల్ని పిండేసే రేంజ్ ఎమోషన్స్ కూడా ఉంటాయని తెలుస్తోంది. గ్యాంగ్ స్టర్ సినిమాల్లో ఎలివేషన్స్ కి తోడు ఎమోషన్స్ పర్ఫెక్ట్ గా కుదిరితే బాక్స్ ఆఫీస్ ఫలితాలు ఎవ్వరూ ఊహించని రేంజ్ లో ఉంటుంది. ఓజీ చిత్రం కూడా అలాగే ఉంటుందట.

 

ఇటీవల విడుదల చేసిన ఒక చిన్న పోస్టర్ లో వర్షపాతం 23 మిల్లీ మీటర్లు నమోదు అయితే, రక్తపాతం ౩౩ మిల్లీమీటర్స్ నమోదు అయ్యాయి అంటూ విడుదల చేసిన ఒక పోస్టర్ సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని వచ్చే నెల 2 వ తేదీన పవన్ పుట్టిన రోజు నాడు విడుదల చెయ్యబోతున్నారు. ఇందులో డైలాగ్స్ కూడా పూనకాలు రప్పించే రేంజ్ లో ఉంటాయని సమాచారం.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -