Samantha: కొత్త ప్రేమను వెల్లడించిన స్టార్ హీరోయిన్ సమంత.. ఆ పోస్ట్ వెనకున్న అర్థం ఇదేనంటూ?

Samantha: సమంత.. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లలో ఈ పేరు కూడా ఒకటి. తరచూ ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తూనే ఉంది సమంత. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు కమర్షియల్ యాడ్స్ లో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. ఇకపోతే ఇటీవలే సమంత తాను ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ ఇవ్వబోతున్నట్లు ప్రకటించి అభిమానులకు ఒకసారి ఇచ్చిన విషయం తెలిసిందే. అందుకు గల కారణం కూడా లేకపోలేదు. గత కొంతకాలంగా మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్న సమంత చికిత్స కోసం దాదాపు ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్నట్లు వెల్లడించింది.

తాజాగా తన తల్లితో కలిసి న్యూయార్క్ కి వెళ్ళిపోయింది సమంత. కాగా ఈమె నటించిన ఖుషి సినిమా సెప్టెంబర్ 1న విడుదల కానున్న విషయం తెలిసిందే. ఆ సినిమా ప్రమోషన్లను సైతం పక్కన పెట్టి సమంత న్యూయార్క్ కి వెళ్ళిపోయింది.
కానీ ఖుషి సినిమా ప్రమోషన్స్ కోసం కొన్ని రోజుల పాటు యాక్టివ్‌గా కనిపించింది. ఖుషి ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌కు సమంత రాలేకపోయిన ఆడియో కార్యక్రమానికి హాజరై తన ప్రమోషన్స్‌ని సామ్ స్టార్ట్ చేసింది. ఈ కార్యక్రమంలో సామ్, విజయ్ దేవరకొండతో కలిసి చేసిన డాన్స్ బాగా వైరల్‌ అయింది. దీంతో సినిమాపై మరింత బజ్‌ క్రియేట్‌ అయింది.

 

కెరియర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికి సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది.. ఈ క్రమంలోనే అప్పుడప్పుడు సోషల్ మీడియా రకరకాల పోస్ట్ లు పెడుతూ ఉంటుంది. కాగా సమంత తాజాగ తన కొత్త ప్రేమ అనే పదంతో ప్రారంభించి ఒక పోస్ట్‌ చేసింది. అక్కడ ఒక గ్లాస్‌లో వాటర్‌ ఉన్న ఫోటోను షేర్‌ చేసింది. మెరిసే నీటి పట్ల కొత్త ప్రేమను కనుగొన్నా అంటూ కొత్త ఆంక్షలతో కొత్త ఆవిష్కరణలు వస్తున్నాయి అని మూడు లవ్‌ ఎమోజీలను చేర్చి తన ఇన్‌స్టాలో రాసుకొచ్చింది. అంతేకాకుండా ఫోటోలో ఆమె చేతికి లవ్‌ అనే అక్షరాలతో ఉన్న అందమైన బ్రాస్‌లైట్‌ను కూడా కనిపిస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -