Balayya: బాలయ్య టార్గెట్ 100 కాదు రూ.200 కోట్లు.. ఏకంగా కుంభస్థలాన్నే కొట్టబోతున్నారా?

Balayya: నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఈయన వీర సింహారెడ్డి సినిమాతో సంచలన విజయం అందుకున్నారు. అదే జోష్ లో ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ భగవంత్ కేసరి అనే సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమాలో శ్రీ లీల కాజల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఈ సినిమా గురించి ఇటు బాలయ్య అభిమానులు అటు బాలకృష్ణ కూడా భారీగానే అంచనాలు పెట్టుకున్నారు.

ఇదిలా ఉండగా బాలకృష్ణ సినీ కెరియర్ లో ఇప్పటివరకు ఏ ఒక్క సినిమా కూడా 100 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను రాబట్ట లేకపోయాయని తెలుస్తుంది. బాలకృష్ణ నటించిన అఖండ సినిమా వీరసింహారెడ్డి సినిమా ఈ స్థాయిలో కలెక్షన్లు రాబట్టే సత్తా ఉన్నప్పటికీ ఆ సినిమాలు విడుదలైనటువంటి పరిస్థితులు ఈ సినిమాకు ఆ స్థాయిలో కలెక్షన్లను సంపాదించలేకపోయాయి.

 

అఖండ సినిమా విడుదల సమయంలో ఒకవైపు కరోనా ఉండగా మరో వైపు సినిమా టికెట్ల రేట్లు భారీగా తగ్గించారు.ఇక వీరసింహారెడ్డి సినిమా విడుదలైన సమయంలో చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా కూడా హిట్ టాక్ అందుకోవడంతో బాలయ్య సినిమాకి కలెక్షన్ల పై ప్రభావం చూపింది.ఇలా ఈ రెండు సినిమాలు కూడా 100 కోట్ల షేర్స్ రాబట్టే సత్తా ఉన్నప్పటికీ పరిస్థితిలు అనుకూలంగా లేకపోవడంతో రాబట్ట లేకపోయాయి.

 

ఇకపోతే ప్రస్తుతం బాలకృష్ణ నటిస్తున్నటువంటి భగవంత్ కేసరి సినిమాపై భారీగానే అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా బాలయ్య సినీ కెరియర్ లోనే అత్యధిక కలెక్షన్లను రాబట్టే సినిమాగా ఉండబోతుందని తెలుస్తుంది. 100 కోట్లు కాదు కదా 200 కోట్ల షేర్స్ రాబట్టగల సత్తా ఉన్న సినిమా ఇదేనని తప్పకుండా ఆ స్థాయిలో కలెక్షన్స్ సాధిస్తుంది అంటూ అభిమానులతో పాటు చిత్ర బృందం కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇలా బాలకృష్ణ రెండు వందల కోట్ల షేర్స్ కలెక్షన్ల టార్గెట్ తోనే ఈ సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -