Hollywood: ఆ హాలీవుడ్ మూవీ ప్రేరణతోనే మహేష్,రాజమౌళి ఫిల్మ్.. అభిమానులకు భారీ షాకిచ్చారంటూ?

Hollywood: త్వరలోనే ప్రముఖ టాలీవుడ్ స్టార్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు కాంబినేషన్ లో ఒక సినిమా మొదలుకానున్న విషయం తెలిసిందే. ఎప్పటి నుంచో వీరిద్దరి కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతోంది అంటూ వార్తలు వినిపించాయి. ఈ విషయాన్ని దర్శకుడు రాజమౌళి అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం రాజమౌళి ఈ సినిమాకు సంబంధించిన పనులను చూసుకుంటున్నారు. మరొకవైపు మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న గుంటూరు కారం సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన గ్రౌండ్ వర్క్ జరుగుతోంది.

లొకేషన్స్ హంటింగ్, స్టోరీ డిస్కషన్స్, కాస్టింగ్ విషయాల డిస్కషన్స్ జరుగుతున్నాయని వినికిడి. ఈ చిత్రానికి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ రాస్తున్నారు. ఈ సినిమా జంగిల్ ఎడ్వెంచర్ గా తెరకెక్కుతోందని తెలిస్తున్న నేపధ్యంలో కథ గురించి రకరకాల విషయాలు వినపడుతున్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో మరొక వార్త తెగ చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే ఈ చిత్రం అప్పట్లో అంటే 2006లో వచ్చిన లియోనార్డో చిత్రం #BloodDiamond ఆధారంగా రూపొందుతోందని సోషల్ మీడియాలో డిస్కషన్ మొదలైంది. అయితే సినిమా కథే అసలు పూర్తైందో లేదో తెలియకుండా ఇలా ఫలానా హాలీవుడ్ చిత్రం బేస్ చేసుకుని ఈ సినిమా చేస్తున్నారని ఎలా చెప్పగలరు, అవన్నీ ఆధారంలేని రూమర్స్ అని కొందరు అంటున్నారు.

 

ఇక మహేశ్ బాబుతో తాను తీయబోయే చిత్రం
అడ్వెంచర్ యాక్షన్ జానర్‌లో ఉంటుందని ఆ మధ్యన ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. ఇండియానా జోన్స్ సిరీస్‍లా అడ్వెంచరస్ యాక్షన్ డ్రామాగా ఆ మూవీ ఉంటుందని తెలిపాడు. దాంతో మహేశ్‍తో తీయబోయే ఈ చిత్రం గ్లోబల్ సినిమాగా ఉంటుందని స్పష్టం చేశాడు. ఇండియానా జోన్స్, జేమ్స్ బాండ్ లాంటి ఎలాంటి హద్దులు లేని గ్లోబల్ సినిమాలను తెరకెక్కించాలనే తపన తనకు చాలా ఉందని రాజమౌళి తెలిపాడు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -