Tollywood: ఇదీ పుష్ప గాడి రేంజ్.. టాలీవుడ్ ఇతర స్టార్ హీరోలకు బన్నీ భలే షాకిచ్చాడుగా!

Tollywood: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు పాన్ ఇండియా హీరో అల్లు అర్జున్. రెండు తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ చూసినా కూడా ఈ పేరు మారుమోగిపోతోంది. తాజాగా అల్లు అర్జున్ ఉత్తమన్న నటుడిగా జాతీయ అవార్డుని అందుకున్న విషయం తెలిసిందే. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అభిమానులు సెలబ్రిటీలు రాజకీయ నాయకులు అల్లు అర్జున్ కి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. పుష్ప సినిమా అల్లు అర్జున్ కు ఈ ఘనత సాధించి పెట్టింది. ‘
తగ్గేదేలే..అంటూ బన్నీ చెప్పిన డైలాగ్స్, చూపించిన మేనరిజమ్స్, చేసిన యాక్టింగ్ బన్నీని జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా నిలబెట్టింది.

అయితే జాతీయ ఉత్తమ నటుడు రేసులో కేవలం టాలీవుడ్ నుంచి మాత్రమే కాకుండా అటు బాలీవుడ్ నుంచి, ఇటు మలయాళం నుంచి చాలా మంది నటులు ఉన్నారు. వీళ్లందర్నీ క్రాస్ చేసి, ఉత్తమ నటుడిగా నిలిచాడు అల్లు అర్జున్. ఈ అవార్డుతో బన్నీ రేంజ్ మరింత పెరిగింది. 69వ జాతీయ ఫిలిం అవార్డుల్లో ఆర్ఆర్ఆర్ మార్క్ స్పష్టంగా కనిపించింది. బెస్ట్ యాక్షన్ డైరక్టర్ గా కింగ్ సోలమన్, బెస్ట్ కొరియోగ్రాఫర్ గా ప్రేమ్ రక్షిత్, బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగంలో శ్రీనివాసమోహన్ ఆర్ఆర్ఆర్ చిత్రానికి గాను జాతీయ అవార్డులకు ఎంపిక అయ్యారు.

 

ఇక బెస్ట్ మ్యూజిక్ డైరక్టర్ విభాగంలో దేవిశ్రీప్రసాద్, కీరవాణి సంయుక్తంగా అవార్డ్ అందుకున్నారు. పుష్ప సినిమాలో పాటలకు గాను దేవిశ్రీప్రసాద్ కు, ఆర్ఆర్ఆర్ సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు కీరవాణికి జాతీయ అవార్డులు వరించాయి. ఆర్ఆర్ఆర్ లో కొమరం భీముడో పాట పాడిన కాలభైరవ, బెస్ట్ మేల్ సింగర్ గా జాతీయ అవార్డ్ దక్కించుకున్నాడు. మొత్తానికి అల్లు అర్జున్ టాలీవుడ్ లో స్టార్ హీరోలకు గట్టి షాక్ ని ఇస్తూ ఉత్తమ నటుడిగా ఎంపిక అవ్వడం నిజంగా గొప్ప విషయమే అని చెప్పవచ్చు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -