Amala: మామూలుగా సినిమా ఇండస్ట్రీలో సినిమాలలో కలిసి నటించిన హీరో హీరోయిన్లు ప్రేమించుకోవడం ఆ తర్వాత పెళ్లి చేసుకోవడం అన్నది కామన్. ఇప్పటికే ఎంతోమంది హీరో హీరోయిన్లు సినిమాలలో నటించి ఆ తర్వాత రియల్ లైఫ్ లో కూడా ఒకటైన విషయం తెలిసిందే. ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో అలాంటి సెలబ్రిటీ జంటలు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారిలో అక్కినేని హీరో మన్మధుడు నాగార్జున, అమలా జంట కూడా ఒకరు. కాగా నాగ్ మొదట వెంకటేష్ సోదరి లక్ష్మిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత కొన్నాళ్లకే వాళ్ళిద్దరి మధ్య విభేదాలు వచ్చి విడిపోయారు.
ఇక ఆ తర్వాత నాగ్ తనతో కలిసి శివ సినిమాలో నటించిన అమల ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీళ్లిద్దరి అన్యోన్య దాంపత్య జీవితం ఎంత అందంగా కొనసాగుతుందో మన అందరికీ తెలిసిందే. పెళ్లయి చాలా ఏళ్ళు అవుతున్నా ఇప్పటికి ఎంతో అన్యోన్యంగా ఉంటూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. కాగా అమల ఒకప్పుడు తమిళంలో పెద్ద స్టార్ హీరోయిన్. అప్పట్లో సూపర్ స్టార్స్ గా ఒక వెలుగు వెలుగుతున్న రజినీకాంత్, కమల్ హాసన్ వంటి హీరోలతో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. ఆ తర్వాత ఆమె తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో కూడా రాజావిక్రమార్క అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది.
అయితే ఆమె ఎన్ని సినిమాల్లో నటించిన, ఆమె కెరీర్ లో ఘర్షణ చిత్రం ఎంతో ప్రత్యేకం అని చెప్పవచ్చు. ఈ సినిమాలో కార్తీక్, ప్రభు లు హీరోలుగా నటించారు. ఈ మూవీ తమిళంతో పాటు, తెలుగులో కూడా విడుదల అయ్యి సూపర్ హిట్ గా నిలిచింది. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో అమల హీరో కార్తీక్ తో ప్రేమాయణం నడిపింది అని అప్పట్లో ఒక పెద్ద టాక్ నడిచింది. అయితే కొన్ని కారణాల వల్ల వీళ్లిద్దరు విడిపోయారని, అమలని పెళ్లి చేసుకునేందుకు కార్తీక్ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదని టాక్.