TDP-Janasena: టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థులకు 60 వేల మెజారిటీ గ్యారంటీ.. విశ్లేషకుల లెక్కలివేనా?

TDP-Janasena: ఆంధ్రప్రదేశ్లో 2024 వ సంవత్సరంలో జరగబోయే ఎన్నికలలో భాగంగా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ రెండు కలిసి పోటీకి దిగబోతున్నాయనే విషయం మనకు తెలిసిందే. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి ఎన్నికల బరిలోకి వస్తున్నాయనీ అధికారికంగా తెలియజేశారు. ఈ క్రమంలోనే ఈ రెండు పార్టీలు కలిసి రావడంతో కొన్ని ప్రాంతాలలో వైసిపి అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని చెప్పాలి.

కొన్ని సర్వేల ప్రకారం ఉభయగోదావరి జిల్లాలతో పాటు మరికొన్ని ప్రాంతాలలో టిడిపి జనసేనకు మంచి మెజారిటీ వస్తుందని సర్వేలు చెబుతూ ఉన్నాయని. ఈ ప్రాంతాలలో ఉమ్మడి టిడిపి జనసేన అభ్యర్థులను కనుక పోటీలోకి దించితే దాదాపు 60 నుంచి 70 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందే అవకాశాలు ఉన్నాయని ఈ సర్వేలు చెబుతున్నాయి.

ఇంకా చెప్పాలి అంటే లోక్ సభ సీట్లకు వచ్చేసరికి రెండు నుంచి మూడు లక్షల ఓట్ల మెజార్టీ వస్తుందని కూడా స్పష్టంగా గ్రౌండ్లో వాతావరణం కనిపిస్తుంది. ఏది ఏమైనా జనసేన టిడిపి కలిసి ఎన్నికల బరిలోకి దిగితే వైసిపి అభ్యర్థుల ఓటమి ఖాయమేనని ఇప్పటికే పలువురు వైసిపి నేతలు గుండెల్లో భయం కూడా మొదలైందని తెలుస్తోంది.

ఇక ఇలాంటి సమయంలోనే చంద్రబాబు నాయుడు కూడా అరెస్టు కావడంతో ఏపీ రాష్ట్ర రాజకీయాలలో పెద్ద ఎత్తున మార్పులు చోటుచేసుకున్నాయి. మరి వచ్చే ఎన్నికలలో ఏ పార్టీ ఏ స్థాయిలో సీట్లు కైవసం చేసుకుంటుంది ఎవరు అధికారంలోకి రాబోతున్నారు అన్న విషయాల గురించి రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చలకు కారణమైంది. టిడిపి జనసేన కలిస్తే గెలుపు ఖాయమైనట్టు ఈ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు 175 స్థానాలలోనూ తమ పార్టీ జెండా ఎగరబోతుంది అంటూ వైసిపి నేతలు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ఎవరు ఎన్ని సీట్లు గెలుపొందుతారనే విషయం తెలియాల్సిందే.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -