Vaishnavi Chaitanya: షూటింగ్ లో అందరి ముందే బట్టలు మార్చుకున్న వైష్ణవి చైతన్య.. మరీ ఘోరమంటూ?

Vaishnavi Chaitanya:  “వైష్ణవి చైతన్య”ఇప్పుడు ఎక్కడ విన్నా ఈ పేరే వినిపిస్తుంది. బేబీ సినిమాకి ముందు ఆమె సినిమాలలో చిన్న క్యారెక్టర్లలో చేసింది. అయినా ఎలాంటి గుర్తింపు రాలేదు. కానీ బేబీ సినిమా ఆమెని ఓవర్ నైట్ స్టార్ ని చేసేసింది. నిజానికి ఆమె గతంలో షార్ట్స్, షార్ట్ ఫిలిమ్స్ అలాగే వెబ్ సిరీస్లలో నటించేది. షణ్ముఖ్ జస్వంత్ తో కలిసి ఈమె చేసిన సాఫ్ట్వేర్ డెవలపర్స్ వెబ్ సిరీస్ చాలా ఫేమస్ అయ్యింది.

అయితే బేబీ హిట్ అయిన తర్వాత పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్న వైష్ణవి చైతన్య తను ఎదుర్కొన్న ఒక బాధాకరమైన సంఘటనని షేర్ చేసుకుని బాగా ఎమోషనల్ అయింది. ఇంతకీ ఏం జరిగిందంటే ఒక ఇంటర్వ్యూలో మీరు ఇంత ఫేమ్ రావటానికి ముందు ఎలాంటి సమస్యలైనా ఎదుర్కొన్నారా అని యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానం గా వైష్ణవి చైతన్య ఇలా చెప్పుకొచ్చింది. ఒక సినిమా షూటింగ్లో పాల్గొన్న నేను తదుపరి షెడ్యూల్ కోసం బట్టలు మార్చుకోవాల్సి వచ్చింది.

అయితే ఆ షూటింగ్ అవుట్డోర్లో జరుగుతూ ఉండటం మూలంగా చుట్టుపక్కల ఎక్కడా రూమ్స్ లేవు. అందుకని హీరోయిన్ అసిస్టెంట్ దగ్గరికి వెళ్లి నేను మీ కేరవాన్ లో డ్రెస్ చేంజ్ చేసుకుంటాను అని అడిగిందట. అయితే అందుకు ఆ అసిస్టెంట్ అవమానకరంగా మాట్లాడి, కుదరదు అంటూ మొహం మీదే చెప్పేసాడంట. దాంతో ఆమె చాలా అవమానకరంగా ఫీల్ అయినట్లు చెప్పుకొచ్చింది వైష్ణవి.

అయితే ఆమె బాధను అర్థం చేసుకున్న లేడీ టెక్నీషియన్లు షూటింగ్ సెట్లో అందరూ ఉంటుండగానే చుట్టూ పరదాలు పెట్టి డ్రెస్ మార్చుకోమని అన్నారుట. దాంతో ఎలాగోలా వైష్ణవి చైతన్య డ్రెస్ మార్చుకుని తర్వాత లేడీ టెక్నీషియన్స్ కి థాంక్స్ చెప్పిందట. ఇదే విషయం గురించి యాంకర్ కి చెప్తూ బాగా ఎమోషనల్ అయింది వైష్ణవి. చైతన్య షూటింగ్స్ లో ఆడవాళ్లు ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేస్తారు. కానీ బయట వాళ్ళు ఎంతో ఈజీగా మాటలు అనేస్తారు అంటూ లేడీ ఆర్టిస్టుల కష్టాలు చెప్పుకొచ్చింది వైష్ణవి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -