Samantha: రూ.5 వేల కోసం సమంత అలాంటి పనులు చేసిందా.. ఈ షాకింగ్ నిజాలు తెలుసా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నటువంటి సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నటిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె కేవలం తెలుగు సినిమాలలో మాత్రమే కాకుండా తమిళం హిందీ భాషా సినిమాలలో కూడా అవకాశాలను అందుకొని కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా ఇండస్ట్రీలో ఎలాంటి సపోర్ట్ లేకుండా ఇంత స్టార్ హీరోయిన్గా సక్సెస్ అందుకున్నటువంటి ఈమె ఇండస్ట్రీలోకి రాకముందు ఏం చేశారు అనే విషయం గురించి ఒక వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

వాస్తవానికి సమంత కేరళ రాష్ట్రానికి చెందిన అమ్మాయి ఆయనప్పటికీ తన తల్లిదండ్రులు ఉద్యోగం రీతి చెన్నైలో స్థిరపడ్డారు. దీంతో సమంత చెన్నైలోనే పుట్టి పెరిగింది అక్కడే తన విద్యాభ్యాసం కూడా పూర్తి చేసింది. అయితే సమంత మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి కావడంతో ఒకవైపు చదువుతూనే మరోవైపు పార్ట్ టైం జాబ్స్ కూడా చేస్తూ ఉండేవారు. ఇలా మెల్లిమెల్లిగా పలు యాడ్స్ చేయడం అలాగే మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టడం ఆ తర్వాత హీరోయిన్గా అవకాశాలు అందుకోవడం జరిగింది.

ఇలా ఇండస్ట్రీలోకి రాకముందు సమంత ఒక కమర్షియల్ యాడ్ లో నటించింది. తమిళనాడుకు చెందిన ఆషిక జువెలరీకి సంబంధించి.. వస్తువులను ప్రమోట్ చేసే యాడ్ చేసింది. ప్రస్తుతం ఈ యాడ్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ వీడియోలో సమంతని కనుక చూస్తే అసలు ఇక్కడ సమంతానేనా అనే భావన ప్రతి ఒక్కరికి కలుగుతుంది అసలు గుర్తుపట్టలేనంతగా ఉన్నారు.

ఇలా నగలను ప్రమోట్ చేస్తూ ఈమె చేసినటువంటి ఈ యాడ్ కోసం సమంతకు అప్పట్లో 5000 రూపాయల రెమ్యూనరేషన్ ఇచ్చారట. ఇలా ఇండస్ట్రీలో తనని తాను ప్రూఫ్ చేసుకుంటూ అంచలంచలుగా ఎదుగుతూ ఎంతో కష్టపడి నేడు ఈమె పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ అనే గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక సమంత చివరిగా ఖుషి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా తర్వాత ఈమె తన వ్యక్తిగత కారణాలవల్ల ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -