Lakshmi Pranathi: ఆ విషయంలో తీవ్రంగా హర్ట్ అయిన జూనియర్ ఎన్టీఆర్ భార్య.. అసలేం జరిగిందంటే?

Lakshmi Pranathi: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కెరియర్ పరంగా ఎన్టీఆర్ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో సంతోషంగా ఉన్న విషయం మనకు తెలిసిందే. ఎన్టీఆర్ లక్ష్మీప్రణతి అనే అమ్మాయిని వివాహం చేసుకొని వైవాహిక జీవితంలో కూడా ఎంతో సంతోషంగా గడుపుతున్నారు.

ఇక ఎన్టీఆర్ భార్య సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉంటారు అనే సంగతి మనకు తెలిసిందే. ఈమె ఏదైనా కుటుంబానికి సంబంధించిన వేడుకల నిమిత్తం బయటకు వచ్చినప్పుడు మాత్రమే లక్ష్మీ ప్రణతి ఫోటోలు మనకు దర్శనమిస్తుంటాయి. అంతకుమించి సోషల్ మీడియాలో ఎక్కడ ఈమె తన ఫోటోలను షేర్ చేయదు అలాగే సోషల్ మీడియాకు దూరంగా ఉంటారు. నిత్యం పిల్లలు కుటుంబ బాధ్యతలను ఎంతో చక్కగా నిర్వర్తిస్తున్నటువంటి లక్ష్మీ ప్రణతి ఒక విషయంలో మాత్రం చాలా బాధపడ్డారట.

ఈమె ఎన్టీఆర్ ను పెళ్లి చేసుకున్న తర్వాత ఎన్టీఆర్ నటించినటువంటి సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. ఆ సమయంలో కొంతమంది లక్ష్మీ ప్రణతిని భారీగా ట్రొల్ చేశారట. ఈమె ఎన్టీఆర్ జీవితంలోకి వచ్చిన తరువాతనే ఎన్టీఆర్ సినీ కెరియర్ ఇబ్బందులలో పడింది అంటూ చాలామంది లక్ష్మీప్రణతిని ట్రోల్ చేయడంతో ఆమె ఈ విషయంపై ఎంతో బాధపడ్డారని తెలుస్తుంది.

సినిమాలు అన్న తర్వాత హిట్ ఫ్లాప్ రావడం సర్వసాధారణం ఎన్టీఆర్ సినిమాలు ఫ్లాప్ అయితే దానికి నేను కారణం ఏంటి అంటూ ఈమె తన సన్నిహితుల దగ్గర అలాగే తన భర్త దగ్గర కూడా చెప్పుకొని బాధపడ్డారు. సినిమా ఇండస్ట్రీలో ఉన్న తర్వాత ఇలాంటివన్నీ కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది వాటి గురించి ఆలోచించకు అంటూ ఈమెకు ఎన్టీఆర్ నచ్చ చెప్పారట. ఇంకొకసారి ఇలా తన గురించి వార్తలు వస్తే మాత్రం తాను చర్యలు తీసుకుంటాను అంటూ ఈమె సన్నిహితుల దగ్గర చెప్పినట్టు తెలుస్తుంది. అయితే అనంతరం లక్ష్మీ ప్రణతి మంచితనం తన నడవడిక చూసి అభిమానులు ఈమెను పొగడటం మొదలుపెట్టారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -