Nagarjuna: నాగార్జున నిజస్వరూపం బయటపెట్టిన ప్రముఖ ఎడిటర్.. ఎదురుపడినా పలకరించడంటూ?

Nagarjuna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్నటువంటి వారిలో అక్కినేని నాగార్జున ఒకరు. నాగేశ్వరరావు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినటువంటి నాగార్జున ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం నాగార్జున ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు బుల్లితెర కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇకపోతే నాగార్జున గురించి తాజాగా సీనియర్ ఎడిటర్ మార్తాండ్ కే వెంకటేష్ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

మార్తాండ్ కే వెంకటేష్ గత కొంతకాలంగా ఎడిటర్ గా పనిచేస్తున్నారు. ఈయన సీనియర్ ఎడిటర్ కావడంతో ఎంతోమంది స్టార్ డైరెక్టర్లు కూడా ఈయనతో తమ సినిమాలను ఎడిటింగ్ చేయిస్తూ ఉంటారు ఇలా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈయన తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా మార్తాండ్ కె వెంకటేష్ మాట్లాడుతూ.. 1999 వ సంవత్సరం నుంచి అన్నపూర్ణ స్టూడియోతో కలిసి పని చేస్తున్నానని తెలిపారు.

ఇలా తాను అన్నపూర్ణ స్టూడియోతో కలిసి పనిచేయటం వల్ల రోజు అక్కినేని నాగార్జున గారిని చూస్తూనే ఉంటాను. అయితే ఆయన ఎదురుగా వెళ్లి మనం పలకరించిన తాను మాత్రం పలకరించకుండా వెళ్లిపోతారని ఈయన తెలియచేశారు. అందుకే తను ఎదురుపడిన ప్రతిసారి తాను కూడా మాట్లాడకుండా వెళ్లి తన పని తాను చేసుకుంటానని తెలిపారు. అయితే నాగార్జున మాత్రమే కాకుండా నాగచైతన్యతో కూడా తనకు అలాంటి అనుబంధమే ఉందని తెలిపారు.

ఇలా రోజు కనిపించిన వారిని తాను పలకరించని ఇక వారితో ఏదైనా పని ఉంటే పర్సనల్గా వెళ్లి మాట్లాడతానని ఆ పని అక్కడితోనే మర్చిపోతానని ఈయన వెల్లడించారు. ఇలా నాగార్జునని మొదట్లో పలకరించిన పలకరించకపోవడంతో తనని మాట్లాడించడమే మానేశానని తెలిపారు. ఇక ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో తనకు కూడా ఎన్నో అవమానాలు ఎదురయ్యాయని అయితే ప్రస్తుతం తాను అలవాటు పడిపోయాను అంటూ ఎడిటర్ మార్తాండ్ కే వెంకటేష్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -