Naga Saroja: అక్కినేని నాగార్జున సోదరి నాగ సరోజ మృతి.. శోకసంద్రంలో అక్కినేని కుటుంబం!

Naga Saroja: తాజాగా అక్కినేని ఇంట్లో ఒక తీవ్ర విషాదం నెలకొంది. అక్కినేని నాగార్జున ముగ్గురు సిస్టర్స్ లో ఒకరైన నాగ సరోజ తాజాగా అనారోగ్యం కారణంగా చనిపోయారు. అయితే ఈ విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంగళవారం రోజున ఆమె హైదరాబాదులో తుది శ్వాస విడిచిన్నప్పటికీ ఈ విషయం మాత్రం బయట ఎవరికీ తెలియలేదు. టాలీవుడ్ లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావుకు సత్యవతి, నాగ సరోజ, నాగ సుశీల, వెంకట్, నాగార్జున ఇలా ఐదుగురు సంతానం. పెద్ద కుమార్తె సత్యవతి చాలా కాలం క్రితమే కన్నుమూశారు.

తాజాగా నాగ సరోజ మరణించినట్లు సమాచారం. కాగా గత కొద్దిరోజులుగా నాగ సరోజ అనారోగ్య సమస్యలతో బాధపడుతోందట. అయితే అక్కినేని అభిమానులకు మాత్రమే కాకుండా సామాన్య ప్రజలకు కూడా నాగ సరోజ గురించి అసలు తెలియదు. అక్కినేని లాంటి పెద్ద ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ ఆమె ఏ రోజు కూడా మీడియా ముందుకు రావడం అలాగే, సినిమాలకు సంబంధించిన విషయాలు గురించి ప్రస్తావించకపోవడం సినిమా ఇండస్ట్రీకి రాకపోవడంతో ఆమె ఎవరు అన్నది కూడా చాలామందికి తెలియదు.

నాగ సరోజ చెల్లెలు నాగ సుశీల మాత్రం నిర్మాతగా చిత్రాలు తెరకెక్కించారు. ఈమె కుమారుడు సుశాంత్ నటుడిగా రాణిస్తున్నాడు. నాగ సరోజ మరణవార్త విన్న ప్రముఖులు, అభిమానులు సంతాపం ప్రకటిస్తున్నారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో అక్కినేని అభిమానులు నాగ సరోజ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -