Marriage: కట్నం, ఎక్కువ డబ్బుల కోసం పెళ్లి చేసుకుంటున్నారా.. అలాంటి బంధాలు ఎలా నిలుస్తున్నాయంటే?

Marriage: సాధారణంగా తల్లిదండ్రులు పిల్లలకి పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు తమకన్నా పై స్థాయి వాళ్లకి ఇచ్చి పెళ్లి చేయాలని ఆలోచిస్తారు. వాళ్ళ ఉద్దేశం ఏమిటంటే పిల్లలు ఫైనాన్షియల్ గా ఎటువంటి ఒడిదుడుకులు ఉండకూడదని. ఆర్థికంగా సెటిలైన అబ్బాయికి, మంచి జీతం వచ్చే ఉద్యోగం ఉన్న అబ్బాయికి, ఫైనాన్షియల్ గా చీకు చింతలేని కుటుంబానికి అమ్మాయిని ఇవ్వాలని ఏ తల్లిదండ్రులైన కోరుకుంటారు. కూతుర్ని తమకన్నా తక్కువ స్థాయి ఇంటికి కోడలుగా పంపించే తల్లిదండ్రులు చాలా అరుదు.

కొన్ని సంవత్సరాల క్రితం అబ్బాయి డబ్బున్న వాడు అయితే చాలు మిగిలిన విషయాలని అంతగా పట్టించుకునేవారు కాదు తల్లిదండ్రులు. కానీ ఇప్పుడు ఆడపిల్లలకి ఛాయిస్ బాగా పెరిగింది. డబ్బు ఉండటంతో పాటు అబ్బాయిలలో ఇంకా చాలా లక్షణాలని కోరుకుంటున్నారు అమ్మాయిలు. వాళ్ల కోరికలు చెల్లుబాటు అయ్యే పరిస్థితి నేటి సమాజంలో ఉంది. అలాగే అబ్బాయిలు కూడా తమ కన్నా పై స్థాయి అమ్మాయిని లేదంటే ఎక్కువ జీతం వచ్చే అమ్మాయిని..

లేదంటే కుటుంబ పరంగా తనకన్నా ఎక్కువ ఆస్తులు ఉన్నటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అబ్బాయిల పరిస్థితి ఏమిటో అని ఆలోచనకి వస్తే.. నేటి యువత అసలు అలాంటి ఆలోచనలకే తావు ఇవ్వటం లేదు ఇదేమీ పెద్ద ఇబ్బందికరమైన అంశం కాలేదని వారు బాహాటంగానే చెప్తున్నారు. తమ అత్తింటి వారికి బాగా డబ్బు ఉందని డబ్బు కలిసొస్తుందని, ఫైనాన్షియల్ సెక్యూరిటీ లభిస్తుందని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను అని బాహాటంగా చెప్పే అబ్బాయిలు చాలామందే ఉన్నారు.

అయితే ఒక నిజమైన భార్య భర్తల బంధం అన్యోన్యంగా సాగాలి అంటే అసలు ఫైనాన్షియల్ మేటర్ ఒక మేటరే కాదు అంటున్నారు రిలేషన్ ఎక్స్పర్ట్స్. ఫైనాన్షియల్ పరంగా ఎవరు ఎక్కువ, తక్కువ అని ఆలోచించకుండా అర్థం చేసుకుని అడుగులు ముందుకు వేస్తే ఆ బంధం గొప్పగా ఉంటుంది. ఎలాంటి సంబంధంలో అయినా కూడా సర్దుకుపోవటం అనేది చాలా అవసరం అని అర్థం చేసుకుంటే అసలు ఈ విషయాలు ఏవి పరిగణలోకి రావు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -