Jani Master: జానీ మాస్టర్ తండ్రి లారీ డ్రైవరా.. అలాంటి సమస్యలు ఎదుర్కొన్నారా?

Jani Master: సౌత్ ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో జానీ మాస్టర్ ఒకరు. ఈయన కొరియోగ్రాఫర్ గా ప్రస్తుతం ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇక ఇటీవల కాలంలో ఈయన పొలిటికల్ గురించి కూడా కామెంట్లు చేయడంతో వార్తల్లో నిలిచారు. ఆర్జీవి గారికి పవన్ అంటే ఎంత ఇష్టమో నాకు జగన్ అంటే కూడా అంతే ఇష్టం అంటూ ఈయన సెటైరికల్ గా కామెంట్ చేశారు.

 

ఇలా పొలిటికల్ గురించి కామెంట్లు చేస్తూ వార్తలలో నిలిచినటువంటి ఈయన ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన ఎన్నో విషయాలను వెల్లడించారు. తాను చాలా నిరుపేద కుటుంబంలో పుట్టి ఈ స్థాయికి చేరుకున్నానని తెలిపారు. ఒక పూరి గుడిసెలో నేను పుట్టానని మా నాన్న లారీ డ్రైవర్ గా పనిచేస్తే నేను మెకానిక్ గా కూడా పనిచేశానని తెలిపారు.

అదేవిధంగా బేల్దారి పని చేసే వాడినని 20 రూపాయలు తీసుకొని దాన్యం బస్తాలకు కూడా కాపలా ఉండేవాడినని జానీ మాస్టర్ వెల్లడించారు అంతేకాకుండా స్మశానంలో కాటి కాపరిగా కూడా తాను పనిచేశాను అంటూ ఈయన సంచలన వ్యాఖ్యలు చేశారు. సగం కాలి పైకి లేచినటువంటి శవాలన్నింటిని కూడా నేను కొడుతూ ఉండేవాడిని అందుకుగాను నాకు మూడు రూపాయలు ఇచ్చేవారు అంటూ జానీ మాస్టర్ వెల్లడించారు.

 

ఇక ఈయన పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అనే సంగతి మనకు తెలిసిందే .ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గురించి కూడా మాట్లాడుతూ ఆయన ఎంతో మంచి వారని ఆయన చేసిన సహాయాన్ని బయటకు చెప్పుకోరని జానీ మాస్టర్ వెల్లడించారు అంతేకాకుండా జనసేన పార్టీ తరుపున పోటీ చేయబోతున్నారా అన్న ప్రశ్నకు నాకు టికెట్ ఇస్తారా లేదా అన్నది పార్టీ నే కన్ఫామ్ చేయాలి అంటూ ఈ సందర్భంగా జానీ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -