Niharika: పెళ్లి గురించి నిహారిక సంచలన వ్యాఖ్యలు.. ఏం చెప్పారంటే?

Niharika: నిహారిక కొణిదెల. ఈమె మెగా ఫ్యామిలీలో రెబల్ డాటర్ అని చెప్పాలి. ఎందుకంటే ఈమె అందరినీ ఎదిరించి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది ఆమె హీరోయిన్ గా చేయడం అటు మెగా అభిమానులకి ఇష్టం లేదు, ఇటు మెగా ఫ్యామిలీకి ఇష్టం లేదు. అయినప్పటికీ డేర్ చేసి సిల్వర్ స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చింది నిహారిక.అలాగే బుల్లి తెర మీద కూడా చాలా ప్రోగ్రాములు చేసింది.

 

జబర్దస్త్ తొలినాళ్లలో తండ్రితో కలిసి ఆ షో ని రక్తి కట్టించింది నిహారిక. ఆపై వెండితెరపై చాలా సినిమాలు చేసింది. అయినా పెద్దగా కలిసి రాకపోవడంతో పెద్దలు చూపించిన గుంటూరుకు చెందిన వెంకట చైతన్య జొన్నలగడ్డ ని పెళ్లి చేసుకుంది. ఆపై విడాకులు తీసుకుంది ఇలా ప్రతి విషయంగా ఏదో ఒక విషయంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది నిహారిక. ఇప్పుడు కొత్తగా మరొక వీడియోతో వైరల్ అవుతుంది ఈ మెగా డాటర్.

సూర్యకాంతం సినిమాలో నిహారికకి తల్లి పాత్రలో నటించిన సుహాసిని ఆమెని పెళ్లి చేసుకోమని అడుగుతుంది. మళ్లీ పెళ్లి అంటే లేచిపోతా ఈ పెళ్లి గిల్లి నాకు సెట్ కావు వదిలేయ్ అంటుంది నిహారిక. ఈ ఓల్డ్ వీడియో బయటకు తీసిన నెటిజెన్స్ నిహారిక తనకు పెళ్లి సెట్ కాదని ముందే చెప్పింది, నాగబాబు అర్థం చేసుకోకుండా పెళ్లి చేశాడు అని నాగబాబుని తెగ ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్స్.

 

ఇప్పుడు ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది. నిహారిక పర్సనల్ విషయానికి వస్తే విడాకుల తరువాత నిహారిక తన దృష్టి మొత్తం కెరియర్ పైనే పెట్టింది. అలాగే డెడ్ పిక్సెల్స్ పేరుతో ఒక వెబ్ సిరీస్ చేసింది. ఆఫీస్ కూడా ఓపెన్ చేసిన నిహారిక నిర్మాతగా కొన్ని ప్రాజెక్ట్స్ చేయనుంది. అలాగే నటన మీద కూడా దృష్టి పెట్టిన నిహారిక తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. అయితే నిహారిక చేసిన ప్రతి పనికి తన తండ్రి పూర్తి సపోర్టు ఉండటం గమనార్హం.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -