Nagarjuna: సంక్రాంతి కిట్టయ్యదేనా.. నాగార్జున పర్ఫామెన్స్ మామూలుగా లేదుగా!

Nagarjuna: సంక్రాంతి పండుగ కానుకగా రిలీజవుతున్న సినిమాలలో చివరిగా నా సామిరంగ సినిమా రిలీజ్ కానుంది. నాగ్, అషికా రంగనాథ్ హీరోహీరోయిన్లుగా విజయ్ బిన్ని డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా ఉండనుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సంక్రాంతి కిట్టయ్యదేనని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ట్రైలర్ లో నాగార్జున పర్ఫామెన్స్ మాత్రం మామూలుగా లేదు.

ట్రైలర్ లో కథ గురించి పూర్తిస్థాయిలో రివీల్ చేయకపోయినా పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో సంక్రాంతి పండుగ కానుకగా ప్రేక్షకులు ఎలాంటి సినిమాను కోరుకుంటారో అలానే ఈ సినిమా ఉండనుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. అషికా రంగనాథ్ వరలక్ష్మి పాత్రలో ట్రైలర్ లో చీరకట్టులో అందంగా కనిపించారు. నరేష్, రాజ్ తరుణ్ పాత్రలకు ట్రైలర్ లో పెద్దగా ప్రాధాన్యత దక్కకపోయినా సినిమాలో దక్కే ఛాన్స్ అయితే ఉంది.

మలయాళ మూవీకి రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రెస్పాన్స్ ను అందుకుంటుందో చూడాల్సి ఉంది. సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్న చివరి సినిమా ఇదే కాగా మిగతా సినిమాలకు వచ్చే టాక్ ను బట్టి ఈ సినిమాకు థియేటర్లు కేటాయించే ఛాన్స్ అయితే ఉంది. నా సామిరంగ మూవీ మాస్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ అనే చెప్పాలి.

45 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కగా ఇప్పటికే ఈ సినిమాకు 50 కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ జరగడంతో 5 కోట్ల రూపాయల లాభం వచ్చింది. అక్కినేని హీరోలతో వరుసగా సినిమాలను నిర్మిస్తున్న శ్రీనివాస్ చిట్టూరి ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. అక్కినేని నాగార్జున నా సామిరంగ సినిమాతో ప్రేక్షకులతో కూడా నా సామిరంగ అనిపిస్తారేమో చూడాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -