Jakkanna: జక్కన్న బ్యాడ్ సెంటిమెంట్ కు బ్రేక్ వేసే సత్తా తారక్ కొరటాలకు ఉందా?

Jakkanna: సినీ పరిశ్రమలో సెంటిమెంట్స్ ఎక్కువే. కోట్ల తో ముడిపడిన బిజినెస్ కావటంతో దర్శక నిర్మాతలతో పాటు హీరోలు కూడా ఈ సెంటిమెంట్స్ ని ఫాలో అవుతూ ఉంటారు బ్రేక్ చేసి రిస్కులు తీసుకోవడానికి ఇష్టపడరు. అలాగే రాజమౌళి సినిమా సెంటిమెంట్తో ముడిపడిన ఒక అంశం ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని భయానికి గురిచేస్తుంది. రాజమౌళితో సినిమా తీసి హిట్ కొట్టిన హీరోలందరూ తమ తర్వాతి సినిమాలతో ఫ్లాప్ ని ఎదుర్కొన్నారు. ప్రభాస్, ఎన్టీఆర్, రవితేజ, రామ్ చరణ్ తో సహా ప్రతి ఒక్కరూ ఈ సెంటిమెంట్ కి బలైన పెద్ద హీరోలే.

 

ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత కొరటాల శివతో జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆచార్యతో కొరటాల శివ పై చాలా విమర్శలు వస్తున్నాయి. ఎన్టీఆర్ సినిమాను అంచనాలకు తగినట్లుగా అతను తెరకెక్కిస్తాడో లేదో అని అభిమానులు కలవరపడుతున్నారు. దానికి తోడు రాజమౌళి సెంటిమెంట్ తోడవడంతో కొరటాలపై మరింత ఒత్తిడి పెరిగిపోయింది. రాజమౌళి తన సినిమాలో ఒక రేంజ్ లో చూపిస్తారు.

దానికి తోడు రాజమౌళి డైరెక్షన్లో చేసిన హీరోకి ఇమేజ్ అమాంతం పెరిగిపోతుంది. ఆ ఇమేజ్ ని నెక్స్ట్ సినిమా డైరెక్టర్ అంత ఈజీగా క్యాచ్ చేయలేడు. అయితే కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న దేవర సినిమా ఫస్ట్ గ్లింప్స్ చూసిన ప్రేక్షకులు ఈసారిరాజమౌళి సెంటిమెంట్ వర్కౌట్ అవ్వదేమో అనుకుంటున్నారు. ఎందుకంటే దేవర గ్లింప్స్ అంత అద్భుతంగా వచ్చాయి.

 

తారక్ కూడా ఊర మాస్ అవతారంలో అదుర్స్ అనిపిస్తున్నాడు.మరి దేవర సినిమాతో ఎన్టీఆర్ కూడా ఈ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ని ఫేస్ చేస్తాడా లేకపోతే రాజమౌళి సెంటిమెంట్ ని బద్దలుగొడతాడా అన్నది తెలియాలంటే సినిమా విడుదల అయ్యే వరకు వేచి చూడాల్సిందే. ఒకవేళ సినిమా ఫ్లాప్ అయితే కనుక ఎన్టీఆర్ సంగతి పక్కనపడితే కొరటాల శివ కెరియర్ ప్రమాదంలో పడినట్లే.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -