NTR: ఎన్టీఆర్ చేసిన పనితో బన్నీకి భారీ షాక్.. అస్సలు ఊహించలేదుగా!

NTR: కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా అతిలోక సుందరి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతున్న సినిమా దేవర. ఈ సినిమా రిలీజ్ కోసం ఎన్టీఆర్ ప్రేక్షకులే కాదు సినీ అభిమానులు అందరూ ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే దేవర సినిమా గ్లింప్స్ అంత హైలైట్ అయ్యాయి. అయితే ఈ సినిమా ఏప్రిల్ 5న విడుదల చేయనున్నట్లు మూవీ మేకర్స్ ఎప్పుడో ప్రకటించారు. అయితే ప్రస్తుతం ఈ సినిమా వాయిదా పడే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

 

ఏప్రిల్ నెలలో ఎన్నికలు ఉండటంతో పాటు దేవర మూవీకి విఎఫ్ఎక్స్ వర్క్ కి ఎక్కువ సమయం పడుతుందట. అలాగే పాటల రికార్డింగ్ కూడా ఇంకా పూర్తి కాకపోవటంతో సినిమాని పోస్ట్ పోన్ చేసినట్లు సమాచారం. ప్రస్తుత డేట్ ని పోస్ట్ పోన్ చేసిన మూవీ మేకర్స్ మరొక డేట్ ని లాక్ చేశారంట దీనితో అల్లు అర్జున్ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే దేవర మూవీ టీం సరిగ్గా పుష్ప టు సినిమా రిలీజ్ అయిన రోజు..

అంటే ఆగస్టు 15 న విడుదల చేయడానికి ఆలోచిస్తుందంట. ఆరోజు రిలీజ్ చేస్తే సినిమా రికార్డులు సృష్టిస్తుంది అంటున్నారు మూవీ మేకర్స్. అయితే దేవర సినిమాకి పుష్పటు సినిమాకి గట్టి పోటీ అవుతుంది అంటూ అటూ అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్, ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా కంగారు పడ్డారు అయితే ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చిన న్యూస్ ఏమిటంటే పుష్ప టు ఆగస్టు 15న రిలీజ్ అయ్యే అవకాశాలు ఎక్కడా కనిపించడం లేదు.

 

ఎందుకంటే ఈ సినిమా షూటింగు ఆలస్యం అవుతూ రావడం, అలాగే నటుడు జగదీష్ అరెస్ట్ కావటం అలాగే క్వాలిటీ విషయంలో ఏమాత్రం అంచనాలకు తగ్గకుండా మంచి అవుట్ పుట్ ఇవ్వాలని చూస్తున్నారంట మూవీ మేకర్స్. అందుకే ఈ సినిమాని డిసెంబర్ కి వాయిదా వేయాలనుకుంటున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: జగన్ మేనిఫెస్టో మోసాలు.. శవాల మీద పేలాలు ఏరుకునేలా రాజకీయాలు చేశారా?

CM Jagan:  జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో తనకు బైబిల్ ఖురాన్ భగవద్గీత లాంటిది అని చెబుతూ ఉంటారు అయితే ఎన్నికలలో భాగంగా మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఎన్నో పథకాలను అమలు పరచలేదు అయితే ఇలాంటి...
- Advertisement -
- Advertisement -