Tollywood: సీనియర్ హీరోలు ఈ కొత్త బ్యూటీకి ఓటేస్తారా.. ఏం జరిగిందంటే?

Tollywood: ప్రస్తుతం టాలీవుడ్ లో సీనియర్ హీరోలకి హీరోయిన్ల కొరత ఎక్కువగా ఉందని చెప్పాలి. సీనియర్ హీరోలతో సినిమాలంటే ముందు కథ కన్నా హీరోయిన్లను వెతుక్కోవలసిన పరిస్థితి ఏర్పడింది. అయితే నా సామి రంగ సినిమాలో నాగార్జున సరసన నటించిన ఆశికా రంగనాద్ ని చూస్తే ఇకమీదట సీనియర్ హీరోలకి ఒక మంచి పెయిర్ దొరికినట్లు అనిపిస్తుంది.

అంతలా నాగార్జున పక్కన సరిపోయింది ఆషిక ఈ సినిమాలో ఆమె రోల్ కూడా చాలా బాగుంది. కన్నడ చిత్ర సీమలోకి 2016లో క్రేజీ బాయ్స్ సినిమాతో అడుగుపెట్టిన ఈ భామ అక్కడే వరుసగా అవకాశాలు రావడంతో క్రేజీ హీరోయిన్ గా ఎదిగింది ఇప్పుడు ఆమె కన్నడ పరిశ్రమతో పాటు ఇతర పరిశ్రమలపై కూడా కన్నేసింది. పట్టతు అరసన్ అనే సినిమాతో కోలీవుడ్ కి కూడా ఎంట్రీ ఇచ్చింది ఈ భామ.

 

అలాగే అమిగోస్ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే శభాష్ కనిపించుకుని రెండవ సినిమాతోనే నాగార్జున సరసన హీరోయిన్ గా స్థానం దక్కించుకుంది ఈ భామ. ఈ సినిమాలో ఆమె నటనకి మంచి మార్కులు పడ్డాయి. ఈ పండుగకి ఎలాంటి హడావిడి లేకుండా సంక్రాంతి బరిలో దిగి పాస్ మార్కులు వేయించుకొని వెళ్ళిపోయింది నా సామిరంగా సినిమా.

 

ఈ సినిమా హిట్ అవ్వడంతో ఆశికా రంగనాద్ కి టాలీవుడ్ లో ఆఫర్లు ఎక్కువగానే వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఆమె అందం లోనే కాదు అభినయంలో కూడా ఎక్కడ తగ్గడం లేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో టాలీవుడ్ సీనియర్ హీరోలకు ఉన్న హీరోయిన్ల కొరత కారణంగా కూడా ఆమెకు అవకాశాలు ఎక్కువగానే వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి మరి సీనియర్ హీరోలు ఈమెకు ఛాన్సులు ఇచ్చేందుకు ఏమంటారో చూడాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -