Lavanya: నిహారిక రుణం అలా తీర్ఛుకుంటానని చెప్పిన లావణ్య.. ఏమైందంటే?

Lavanya: సినీ ఇండస్ట్రీలో ఏ ఇద్దరు నటీనటులు ప్రేమలో ఉంటే ఆ విషయం వెంటనే అభిమానులకు తెలిసిపోతుంది. అది ఇండస్ట్రీ అంతా పాకిపోతుంది. కానీ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిలు గత ఎనిమిదేళ్లగా ప్రేమలో ఉన్నారు. ఈ విషయం మీద ఎవరికీ ఎటువంటి అంచనా లేదు. గత సంవత్సరం నుంచి ప్రేమలో ఉన్నారనే వార్తలు వచ్చాయి కానీ అప్పుడు కూడా ఇద్దరూ అవును ప్రేమలో ఉన్నాము అని ఏనాడు ఒప్పుకోలేదు.

 

అయితే నేమి కిందటి సంవత్సరం ఇద్దరూ పెళ్ళి చేసుకుని ఒక్కరయ్యారు. ప్రేమించిన ఆరు నెలలకే విడిపోయే ఈ జనరేషన్లో 8 సంవత్సరాల నుంచి రహస్యంగా ప్రేమలో ఉంటూ పెళ్లి చేసుకోవడం అంటే గొప్ప విషయమే అని అభిమానులు ఆనందిస్తున్నారు. అటువైపు వరుణ్ తేజ్ “ఆపరేషన్ వాలెంటైన్” సినిమాతో బిజీగా ఉండగా ఇటు లావణ్య త్రిపాఠి “మిస్ పర్ఫెక్ట్” అనే వెబ్ సిరీస్ లో అలరించనున్నది.

ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్ల కోసం ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న లావణ్య త్రిపాఠిని యాంకర్ ఒక ప్రశ్న అడిగింది. నిహారిక కొణిదెల కి ఆడపడుచు కట్నంగా ఏమైనా డబ్బులు ఇచ్చారా అని అడగగా అలాంటివేవీ ఇవ్వలేదు. నిహారిక అంటే నాకు చాలా ఇష్టం కానీ మంచి కథతో వస్తే తన బ్యానర్ లో నటిస్తాను. ఫ్యామిలీ కాబట్టి డబ్బులు కూడా తీసుకోను అని చెప్పుకొని వచ్చింది లావణ్య త్రిపాఠి.

 

వీళ్లిద్దరి మధ్య బాండింగ్ చాలా ఫ్రెండ్లీగా ఉంటుందని ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అని తెలిపింది. గత చాలా సంవత్సరాలుగా నిహారిక వీళ్లిద్దరి ప్రేమ కోసం సపోర్ట్ చేస్తుంది మంచి ఆడపడుచు అని చెప్పింది లావణ్య త్రిపాఠి. ఎంగేజ్మెంట్ అప్పుడు, పెళ్లి అప్పుడు, రిసెప్షన్ టైంలో కూడా లావణ్య నిహారిక కలిసి ఎన్నో ఫోటోలు దిగిన విషయం అందరికీ తెలిసిందే. మరి నిహారిక బ్యానర్ లో లావణ్య ఎప్పుడు నటిస్తుందో తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -