Varun Tej: స్టార్ హీరో వరుణ్ తేజ్ ఫేవరెట్ హీరోయిన్ ఎవరో మీకు తెలుసా?

Varun Tej: చాలా సంవత్సరాల ప్రేమ తరువాత పెళ్లి చేసుకున్న వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి జంట మళ్ళీ వాళ్ళు పనుల్లో పడిపోయారు. ఎవరి కెరియర్ లో వాళ్ళు బిజీ అయిపోయారు ఇప్పటికే లావణ్య మిస్ పర్ఫెక్ట్ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఇప్పుడు వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్ మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. ఎన్నో వాయిదాలు తర్వాత మార్చి 1న ఆపరేషన్ వాలెంటైన్ విడుదలకు సిద్ధమవుతోంది.

 

దాంతో ప్రమోషన్స్ మొదలుపెట్టారు మూవీ టీం. ప్రమోషన్స్ లో భాగంగా ఒక కాలేజీ విద్యార్థులతో మూవీ టీం ముచ్చటించింది. వారు వరుణ్ తేజ్ ని కొన్ని ప్రశ్నలు సంధిస్తే వాటికి ఈ విధంగా సమాధానం ఇచ్చాడు వరుణ్. మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు అని వరుణ్ తేజ్ ని ప్రశ్నిస్తే నా ఫేవరెట్ హీరోయిన్ నే నేను పెళ్లి చేసుకున్నాను. ఆమె కాకుండా నాకు సాయి పల్లవి అంటే అభిమానం అని చెప్పుకొచ్చాడు.

పెళ్లికి ముందు రెండు సినిమాలలో హీరో హీరోయిన్లుగా నటించిన మీరు పెళ్లి తర్వాత మళ్లీ కలిసి నటిస్తారా అని అడిగితే మంచి కథ కలిసి వస్తే చేస్తామని చెప్పాడు వరుణ్ తేజ్. లావణ్యకి తానే ముందుగా ప్రపోజ్ చేశానని కూడా చెప్పేసాడు వరుణ్. ఆపై ఆపరేషన్ వాలెంటైన్ గురించి మాట్లాడుతూ ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో తెలుగులో వస్తున్న మొదటి సినిమా ఇది కామెడీ సినిమాలు ఎన్ని అయినా చేయవచ్చు.

 

కానీ దేశం కోసం ఏం చేసినా గొప్పగానే ఉంటుంది అని చెప్పాడు. అలాగే పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని ఉంది అని తన కోరికను కూడా బయటపెట్టాడు. ఇక ఈ సినిమాలో వరుణ్ తేజ్ మానుషీ చిల్లర్ హీరో హీరోయిన్లుగా నటించగా సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ రినైసన్స్ పిక్చర్స్ కలిసి నిర్మిస్తున్నాయి.

 

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -