Abhijith: వైరల్ అవుతున్న బిగ్ బాస్ అభిజిత్ సంచలన వ్యాఖ్యలు!

Abhijith: అభిజిత్ పరిచయం అవసరం లేని పేరు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా ద్వారా హీరోగా పరిచయమైన అనంతరం ఇతర సినిమాలలో కనిపించలేదు కానీ బిగ్ బాస్ సీజన్ 4 కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొని పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేశారు. ఈ కార్యక్రమంలో విన్నర్ గా నిలిచినటువంటి అభిజిత్ అనంతరం ఇతర సినిమాలలో కూడా నటించలేదు కానీ వెబ్ సిరీస్ లలో మాత్రం నటిస్తున్నారు.

 

తాజాగా అభిజిత్ లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో నటించడం మిస్ పర్ఫెక్ట్ అనే సిరీస్ లో నటించారు. ఈ సిరీస్ ఫిబ్రవరి 2వ తేదీ నుంచి డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో ప్రసారం కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్ విడుదలవుతున్నటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహించారు. ఈ ప్రమోషన్లలో భాగంగా అభిజిత్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన గురించి ఎన్నో విషయాలను వెల్లడించారు.

ఈ సిరీస్ లో నేను రోహిత్ అనే పాత్రలో కనిపిస్తాను నా పాత్ర చాలా లేజీ పర్సన్ గా ఉండబోతుందని తనకు ఏ విధమైనటువంటి ఇష్టాలు కానీ ఉండవని ఏదో బ్రతకడం కోసం ఉద్యోగం చేస్తూ ఉంటాను కానీ నాకు ఇష్టమైనటువంటి ఒకే ఒక అలవాటు వంట చేయడం ఇది మాత్రం చాలా ఇష్టంగా చేస్తూ ఉంటాను అంటూ ఈయన తన పాత్ర గురించి తెలిపారు.

 

ఇక వ్యక్తిగత జీవితంలో మాత్రం తాను భిన్నంగా ఉంటాను. ప్రతిదీ చాలా సెలెక్టివ్ గా తీసుకుంటానని అయితే కొన్నిసార్లు ఇదే చాలా ఇబ్బందికరంగా మారుతుందని అభిజిత్ వెల్లడించారు. ఇకపోతే తన పెళ్లి గురించి కూడా మాట్లాడుతూ ఇటీవల కాలంలో తన అమ్మ తన పెళ్లి గురించి బాగా గోల చేస్తుందని పెళ్లి చేసుకోమని నన్ను విసిగిస్తుంది అంటూ అభిజిత్ ఈ సందర్భంగా చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

YS Sharmila: జాబు రావాలంటే జగన్ పోవాలి.. వైరల్ అవుతున్న షర్మిల సంచలన వ్యాఖ్యలు!

YS Sharmila: ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల నవ సందేహాలు పేరిట వైయస్ జగన్మోహన్ రెడ్డికి బహిరంగంగా లేఖ రాశారు ఈ లేఖ ద్వారా గత ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన...
- Advertisement -
- Advertisement -