YS Sharmila Arrested: వైఎస్ షర్మిల అరెస్ట్.. జగన్ రెడ్డి పతనం ఇక మొదలైనట్లేనా.. ఇంత ఘోరమా అనేలా?

YS Sharmila Arrested:ఏపీలో మెగా డీఎస్సీ ప్రకటించాలన్న ఉద్దేశంతో ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల నేడు చలో సెక్రటేరియట్ అనే కార్యక్రమానికి పిలుపునిచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే నేడు చలో సెక్రటేరియట్ అనే కార్యక్రమంలో భాగంగా ఆంధ్ర రత్న కార్యాలయం నుంచి సెక్రటేరియట్ వరకు ర్యాలీగా వెళుతున్నటువంటి క్రమంలో మార్గమధ్యంలో పోలీసులు వీరిని అడ్డుకున్నారు.

ఈ విధంగా పోలీసులు అడ్డుకోవడంతో షర్మిల రోడ్డుపై బైఠాయించి పెద్ద ఎత్తున అధికార ప్రభుత్వం పై విమర్శలు చేశారు అనంతరం అమరావతి కరకట్టపై భారీ స్థాయిలో మోహరించిన పోలీసుల ముందుగా పలువురు కార్యకర్తలను అరెస్టు చేశారు. అనంతరం షర్మిల కారు దిగగానే వెంటనే పోలీసులు ఆమెను చుట్టుముట్టి తనని బలవంతంగా వాహనంలోకి ఎక్కించారు.

ఇలా షర్మిల తో పాటు మరికొందరు కార్యకర్తలను అరెస్టు చేయడంతో పోలీసులు కార్యకర్తల మధ్య పెద్ద ఎత్తున వివాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే పలువురు కార్యకర్తలు సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు మొత్తానికి షర్మిలను పోలీసులు అరెస్టు చేయడంతో జగన్మోహన్ రెడ్డి పతనం ఖాయమని మరి సొంత చెల్లి పట్ల ఇలా వ్యవహరించాల అంటూ కామెంట్ లు చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -