Congress: ఏపీ ప్రజలకు 5000 రూపాయలు.. ఈ హామీలతో ఓట్లు పడటం సాధ్యమవుతుందా?

Congress: ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా కనుమరుగైపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ తిరిగి తన మనుగడ సంపాదించుకోవడం కోసం పెద్ద ఎత్తున తాపత్రయపడుతుంది ఇప్పటికే కర్ణాటకలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరేసింది దీంతో ఏపీలో గెలవకపోయినా తన పార్టీని ప్రజలలోకి తీసుకువెళ్లడం కోసం కాంగ్రెస్ అధిష్టానం అన్ని విధాలుగా ప్రయత్నాలు ప్రారంభిస్తున్నారు.

ఈ క్రమంలోనే దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి చేరిన సంగతి తెలిసిందే. ఇక ఈమె ఏపీ పీసీసీ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్నారు. ఇక ఈమె కాంగ్రెస్ పార్టీలోకి చేరిన తర్వాత పెద్ద ఎత్తున సభలను ఏర్పాటు చేసి మరిచిపోయిన కాంగ్రెస్ పార్టీని ప్రజలకు గుర్తు చేస్తున్నారు అంతేకాకుండా ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డి పై విమర్శలు కూడా చేస్తున్నారు.

జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చలేరని ఇలా ఇచ్చిన మాట తప్పిన వాళ్లు రాజశేఖర్ రెడ్డి వారసులు ఎలా అవుతారు అంటూ ఈమె ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇకపోతే అనంతపురంలో ఇటీవల నిర్వహించినటువంటి సభలో కాంగ్రెస్ నాయకుడు ఖర్గే కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన ఎన్నికల హామీలను కూడా ప్రకటిస్తూ వచ్చారు. అనంతపురంలో మొదటి గ్యారంటీని ప్రకటించిన విషయం తెలిసిందే.

కర్ణాటకలో 5 గ్యారెంటీ పథకాలను ప్రకటించగా తెలంగాణలో ఆరు గ్యారెంటీ హామీలను ఇచ్చారు. ఇక ఇటీవల ఆంధ్రప్రదేశ్ అనంతపురంలో జరిగినటువంటి సభలో ఖర్గే మాట్లాడుతూ…తాను అనంతపురం సభకు వచ్చింది ధనవంతుల కోసం కాదని, పేద ప్రజల కోసం ఒక పథకాన్ని ప్రకటించడానికని తెలిపారు. ఇందులో భాగంగా ఇందిరమ్మ అభయ గ్యారెంటీ పథకాన్ని ప్రకటించారు. ఈ పథకం ప్రకారం… కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతీ పేద కుటుంబానికీ నెలకు ఐదువేల రూపాయల చొప్పున ఇస్తామని తెలిపారు.

ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ కూడా తొలి గ్యారెంటీని ప్రకటించడంతో ఈ పార్టీ కూడా ఎన్నికలకు సిద్ధమవుతుందని స్పష్టంగా తెలుస్తుంది. మరి ప్రతి పేద కుటుంబానికి ప్రతినెల 5000 రూపాయలు చొప్పున ప్రకటించడంతో ఈ పార్టీకి ఓట్లు పడేనా అన్న సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇలా తొలి గ్యారెంటీలు ప్రకటించిన కాంగ్రెస్ మరికొన్ని రోజులలో ఏ విధమైనటువంటి గ్యారెంటీలను ప్రకటిస్తారు అనే విషయం తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -