CM YS Jagan: జగన్ రాజకీయ ప్రయోగాలే ఆయనను ముంచేయబోతున్నాయా.. నేతలను మార్చి పెద్ద తప్పు చేస్తున్నారా?

CM YS Jagan: కొన్నిసార్లు ఎంతో సునాయసంగా చేసే పనులను కూడా చాలామంది చాలా కాంప్లికేట్ గా చేస్తూ ఉంటారు. ఇలాంటి వారిని చూసినప్పుడు కొన్నిసార్లు ఆశ్చర్యం కలుగుతుంది అయితే ప్రస్తుతం వైసీపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా అలాంటి కాంప్లికేషన్స్ సృష్టిస్తున్నారని తెలుస్తుంది. ప్రజల నాడి తెలిసిన నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గుర్తింపు పొందారు. అలాంటిది ఈయన ఇప్పుడు జరగబోయే ఎన్నికలలో అభ్యర్థుల విషయంలో ఎంతో గంధర గోళానికి గురవుతున్నారని తెలుస్తోంది.

గత ఎన్నికలలో పెద్ద ఎత్తున మెజారిటీతో గెలిచిన వారందరికీ ఇప్పుడు కొన్నిచోట్ల తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చింది. వారిని తీసేస్తేనే తమ పార్టీ గెలుపుకు దోహదం చేస్తాము లేదా స్వయంగా మేమే అభ్యర్థులను ఓడిస్తాము అంటూ స్వయంగా వైసిపి నాయకులే చెబుతున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆ అభ్యర్థులను తొలగించకుండా వారినే నిలబెట్టడం పార్టీకి పూర్తిగా వ్యతిరేకంగా మారింది.

మరికొన్ని నియోజకవర్గాలలో టిడిపి జనసేన తరపున పోటీ చేయడానికి బలమైన అభ్యర్థులు కూడా లేరు. అయితే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి బలమైన నాయకులను తీసుకెళ్లి మరో ప్రాంతంలో పోటీకి నిలబెట్టడం అక్కడ కొత్త వారిని తీసుకురావడంతో ఈయన గెలుపు కూడా కాస్త కష్టతరంగానే మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక విషయంలో సరికొత్త ప్రయోగాలు చేస్తూ 175 స్థానాలలో గెల పొందాలని ప్రయత్నాలు చేస్తున్నారు అయితే ఇలా చేయడం వల్ల తన పార్టీకే తీవ్ర స్థాయిలో నష్టం వస్తుంది అనే విషయాన్ని గ్రహించలేకపోతున్నారని పలువురు ఈయన వ్యవహార శైలి పై కామెంట్లు చేస్తున్నారు. ఇలా ఒక నియోజకవర్గంలో పోటీ చేసి గెలిచిన నేతలను మరొక నియోజకవర్గానికి మారుస్తూ ఈయన పెద్ద తప్పు చేస్తున్నారని స్పష్టంగా తెలుస్తోంది. అయితే ఈయన ఎలాంటి పొరపాటు చేస్తున్నారనేది వచ్చే ఎన్నికల ఫలితాలు స్పష్టంగా చెప్పబోతున్నాయని అర్థమవుతుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -