Shyamala Devi: బీజేపీ ఎంపీ క్యాండిడేట్ గా ప్రభాస్ పెద్దమ్మ.. అక్కడ ఆమె విజయం సాధించడం ఖాయమేనా?

Shyamala Devi: సినిమా ఇండస్ట్రీలో హీరోగా రాజకీయాలలో ఒక రాజకీయ నాయకుడిగా ఎంతో అద్భుతమైనటువంటి ఆదరణ గుర్తింపు పొందినటువంటి వారిలో దివంగత నటుడు కృష్ణంరాజు ఒకరు. ఈయన రెండు సార్లు ఎంపీగా గెలుపొందారు. అంతేకాకుండా బిజెపి ప్రభుత్వంలో ఈయన కేంద్ర మంత్రిగా కూడా బాధ్యతలను నిర్వహించారు.

ఇలా రాజకీయాలలో కృష్ణం రాజు పాత్ర చాలా కీలకంగా ఉందనే విషయం మనకు తెలిసిందే. ఇక ఈయన చనిపోయే వరకు కూడా బిజెపి పార్టీలో కొనసాగారు గతంలో ప్రజారాజ్యం పార్టీలోకి చేరినటువంటి కృష్ణంరాజు అనంతరం బిజెపి పార్టీకే మద్దతు తెలిపారు. ఇక ఈయన మరణించిన తర్వాత ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి రాజకీయాలలోకి వస్తారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

ఇటీవల కాలంలో గతంలో కృష్ణంరాజు పోటీ చేస్తున్న నరసరావుపేట పరిధిలో ఈమె పెద్ద ఎత్తున హెల్త్ క్యాంపులను కూడా నిర్వహించిన సంగతి మనకు తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా రాజకీయాల గురించి ప్రశ్నించడంతో రాజకీయ ప్రవేశాన్ని తోసి పుచ్చలేదు కానీ సరైన సమయం వచ్చినప్పుడు వెల్లడిస్తానని తెలిపారు. దీంతో ఈమె రాజకీయాల్లోకి వస్తున్నారని స్పష్టంగా అర్థం అవుతుంది.

తాజా సమాచారం ప్రకారం ఈమె బీజేపీ పార్టీ తరఫున నరసరావుపేట ఎంపీ బరిలో దిగబోతున్నారని తెలుస్తోంది. ఇక్కడి నుంచి పోటీ చేస్తే బిజెపి పార్టీ తరఫున కచ్చితంగా గెలుస్తారనే ఉద్దేశంతో ఈ టికెట్ శ్యామలాదేవి గారికి ఇస్తున్నారని సమాచారం ఇక్కడ కనక ఈమె ఎంపీగా పోటీ చేస్తే ప్రభాస్ అభిమానులు తనకు పూర్తిగా మద్దతు తెలుపుతారని ఆమె గెలవడం ఖాయమని తెలుస్తుంది. అయితే ఈ విషయాన్ని త్వరలోనే అధికారికంగా కూడా వెల్లడించనున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -