ABP Survey: రియల్ ఏబీపీ సర్వేలో వైసీపీ పార్టీకి భారీ షాకులు.. అక్కడ క్లీన్ స్వీప్ చేస్తోందిగా!

ABP Survey: వైసీపీ సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆ పార్టీ అధినేత జగన్ కు షాకులు ఇస్తుంటే.. మరో వైపు పలు సర్వేలు కూడా ఊపిరాడనివ్వడం లేదు. ఇప్పటికే చాలా సర్వే సంస్థలు టీడీపీ కూటమి గెలుపును ఖాయం చేస్తే ఒపీనియన్ పోల్స్ ప్రకటించాయి. తాజాగా రియల్ ఏబీపీ సీఓటర్ సంస్థ కూడా తమ సర్వే ఫలితాలను వెల్లడించింది. ఈ సంస్థ కూడా వైసీపీని ప్రజలు ఇంటికి పంపడానికి కంకణం కట్టుకున్నారన తేల్చి చెప్పింది. అయితే.. రియల్ ఏబీపీ సీఓటర్ సర్వే అని ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే.. ఈ మధ్య ఏపీలో ఏబీపీ సీఓటర్ సంస్థ పేరుతో ఓ సర్వే వైరల్ అయింది. ఆ సర్వే ఫలితాలు వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి. అయితే.. వైసీపీ పెద్ద ఎత్తున ఖర్చు చేసి ఏబీపీ సీఓటర్ పేరుతో ఓ పోస్టర్ ఆ పోస్టర్ ను రిలీజ్ చేసింది. అయితే, అది ఫేక్ సర్వే అని అందరికి అర్థం అయింది.

ఎందుకంటే.. ఏబీపీ సీఓటర్ సంస్థ ఎప్పుడైన కరెక్ట్ గా షెడ్యూల్ కి ముందు రోజు తన సర్వే ఫలితాలు ప్రకటించిస్తుంది. నిజానికి శుక్రవారం ఎన్నికల షెడ్యూల్ రావాల్సి ఉంది. అందుకే గురువారం ఏబీపీ సీఓటర్ సంస్థ తన ఫలితాలను వెల్లడించింది. కానీ, వైసీపీ మాత్రం నాలుగు రోజులు ముందుగానే ఏబీపీ సీఓటర్ పేరుతో ఓ సర్వేను విడుదల చేసింది. వైసీపీ వ్యూహాం బూమ్ రాంగ్ అయింది. వైసీపీ ఆ సాహసం చేయడానికి కూడా ఓ కారణం ఉంది. జగన్మోహన్ రెడ్డి టైమ్స్ నౌ సంస్థతో గతంలో సర్వే చేయించారు. ఆ సర్వేల్లో వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తుందని.. 25కి ఏకంగా 24 ఎంపీలు జగన్ కొల్లగొడతారని ఆ సర్వే సారాంశం. రెండు సార్లు ఇదే రకమైన ఫలితానలు టైమ్స్ నౌ ప్రకటించింది. అయితే.. అది వాస్తవానికి దూరంగా ఉందని అందరికీ అర్థం అయింది. అందులోనూ క్రెడిబిలిటీ ఉన్న చాలా సంస్థలు తమ సర్వేల ద్వారా టీడీపీ, జనసేన కూటమి విజయం ఖాయమని తేల్చారు. ఇండియా టుడే సర్వేతో న్యూట్రల్ ఓటర్లు కూడా టీడీపీపై వైపు తిరిగిపోయారు. దీంతో.. వైసీపీ డ్యామేజ్ కంట్రోల్ కోసం మరో క్రెడిబులిటీ ఉన్న సంస్థ పేరుతో ఓ సర్వేను రిలీజ్ చేయాలని భావించింది. అలా ఏబీపీ సీటర్ పేరుతో వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని సర్వే ఫలితాలను వైరల్ చేసింది.

ఇంతలోనే రియల్ గా ఏబీపీ సీటర్ సర్వే బయటకు వచ్చింది. ఈ నెంబర్స్ చూసి వైసీపీ నేతలు షాక్ తింటున్నారు. ఏపీలో మొత్తం 25 లోక్ సభ స్థానానలుండగా 20 స్థానాలను టీడీడీ కూటమి సొంతం చేసుకుంటుందని సర్వేలో తేలింది. వైసీపీ 5 స్థానాలకే పరిమితం అవుతుందని చెప్పింది. ఎన్డీఏ కూటమిక 45 శాతం ఓట్లు వస్తాయని.. వైసీపీకి 42 శాతం ఓట్లు వస్తాయని తెలిపింది. కాంగ్రెస్ గతంలో కంటే మెరుగ్గా 3 శాతం ఓట్లు కొల్లగొడుతుందని తెలిపింది. ఇతరులు 10శాతం ఓట్లు చీల్చుతారని సర్వేలో తేలింది. టీడీపీ కూటమికి వస్తున్న 20 ఎంపీ సీట్లలో బీజేపీ మూడు స్థానాల్లో, టీడీపీ, జనసేన 17 స్థానాల్లో గెలుస్తుందని సర్వే సారాంశం.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -