AP Election 2024: టీడీపీ-జనసేనతో పొత్తుతో గెలుపుపై ధీమా.. బీజేపీలో సీట్ల కోసం డిమాండ్ మామూలుగా లేదుగా!

AP Election 2024: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల నజరానా మోగిన సంగతి మనకు తెలిసిందే .ఇలా ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో పెద్ద ఎత్తున అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కూడా పూర్తికాగా ప్రచార కార్యక్రమాలను మొదలు పెడుతున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీతో బిజెపి కూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలోకి రాబోతున్న సంగతి మనకు తెలిసిందే .ఈ క్రమంలోనే బిజెపి నాయకులు సీట్ల కోసం పెద్ద ఎత్తున ఆరాటపడుతున్నారు.

తెలుగుదేశం పార్టీతో జనసేన పార్టీ పొత్తు పెట్టుకోవడంతో గెలుపు ఖాయమని భావించిన బిజెపి నేతలు తమకే టికెట్ ఇవ్వాలి అంటూ పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. ఏ సీటు ఖరారైందో అంతర్గతంగా సమాచారం తెలుసుకుని.. తాము కన్నేసిన సీట్లు వాటిలో ఉంటే తమకు అన్యా యం జరిగిందంటూ పార్టీ కార్యాలయానికి వస్తున్నారు. ఓ మోస్తారు నాయకులకు పురందేశ్వరి సమాధానం చెప్పి పంపిస్తున్నారు. మరి కొంతమంది పార్టీ కోసం కోట్లు ఖర్చు చేసి కృషి చేశామని తమకే టికెట్ కావాలని కూడా కొందరు డిమాండ్ చేస్తున్నారు.

ఈ విధంగా బిజెపి సీట్లకు పెద్ద ఎత్తున డిమాండ్ ఉన్న నేపథ్యంలో జాతీయ నాయకత్వం ఆదేశాల మేరకు క్షేత్ర స్థాయిలో పనిచేసి గెలిచే అభ్యర్థులకే సీట్లు దక్కుతాయని స్పష్టం చేసింది. పార్టీలో ఎంతో మంది సీనియర్లు టికెట్‌ దక్కినా, దక్కకున్నా పనిచేస్తున్నారని.. మీరు బెదిరిస్తే నాయకత్వం బెదరదని తేల్చి చెప్పారు.

ఈ విధంగా పార్లమెంట్ స్థానాలతో పాటు అసెంబ్లీ స్థానాలకు కూడా బిజెపిలో పెద్ద ఎత్తున పోటీలు ఏర్పడ్డాయి. మరి ఏ సీటు ఎవరికి కేటాయించారనే విషయం గురించి త్వరలోనే అభ్యర్థుల జాబితా విడుదల చేయబోతున్నట్లు సమాచారం.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -