Telangana TDP: తెలంగాణ టీడీపీకి ఊపిరి పోస్తున్న బీజేపీ.. తెలంగాణలో తెలుగుదేశంకు పూర్వ వైభవం వస్తుందా?

Telangana TDP: త్వరలోనే తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో టిడిపి ప్రభుత్వం అనూహ్యమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఇదివరకే అసెంబ్లీ ఎన్నికలు జరగగా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పోటీ చేయడానికి ఆసక్తి చూపించలేదు కానీ పార్లమెంట్ ఎన్నికలలో మాత్రం పోటీ చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా పార్లమెంట్ ఎన్నికలలో పోటీ చేయడానికి కారణం లేకపోలేదు.

తెలంగాణలో ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి చాన్స్ ఇవ్వకుండా బిజెపి ప్రభుత్వం పెద్ద ఎత్తున వ్యూహాలు రచిస్తుందని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో బిజెపి తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగబోతుంది. ఈ క్రమంలోనే ఇదే మిత్రవాదాన్ని తెలంగాణలో కూడా అమలు చేయబోతున్నారని తెలుస్తోంది. ఎన్డీఏ కూటమి కేంద్రంలో అధికారంలోకి రావడం ఎంతో ముఖ్యం కనుక బిజెపి తెలుగుదేశం పార్టీ పొత్తులో భాగంగా తెలంగాణలో కూడా పార్లమెంటు ఎన్నికలలో పోటీ చేయటానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది.

తెలంగాణ‌లో త‌మ‌కు క్లిష్టంగా.. టీడీపీకి ఈజీగా ఉన్న సీట్ల‌లో టీడీపీకి అవ‌కాశం ఇచ్చి.. కాంగ్రెస్‌, బీఆర్ ఎస్ పార్టీల‌కు చెక్ పెట్టాల‌నేది బీజేపీ నేత‌ల వ్యూహంగా క‌నిపిస్తోంది. తెలంగాణ బీజేపీ ఇప్పటి వరకూ 15 స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారు చేసింది. వరంగల్, ఖమ్మంకు మాత్రమే పెండింగ్ పెట్టారు. ఖమ్మం నుంచి జలగం వెంకట్రావును పార్టీలో చేర్చుకున్నారు. అతనికే టికెట్ ఖరారని అందరూ భావించారు కానీ ఇప్పటివరకు విడుదల చేసిన జాబితాలో ఈయన పేరు లేదు అదే విధంగా వరంగల్ సీటు కూడా ఖాళీగా పెట్టారు ఈ రెండు చోట్ల టిడిపికి అనుకూలంగా ఉన్నటువంటి వారికి సీటు ఇవ్వాలని అధిష్టానం ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -