Two States CMs Arrest: ఇద్దరు సీఎంల అరెస్ట్.. బీజేపీ టార్గెట్ చేస్తే ముఖ్యమంత్రులైనా గజగజా వణకాల్సిందేనా?

Two States CMs Arrest: రెండు నెలల వ్యవధిలోనే ఏకంగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అరెస్ట్ కావడంతో దేశవ్యాప్తంగా ఈ విషయం సంచలనంగా మారింది. ఒక రాష్ట్రాన్ని పాలించే ముఖ్య మంత్రి పదవిలో ఉండి అరెస్టు కావడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఇలా ఇద్దరు ముఖ్యమంత్రులు అరెస్టు అయ్యారు అంటే వారు ఏదైనా అవినీతికి పాల్పడ్డారా లేదంటే ఏదైనా హత్యలు చేశారా అని సందేహాలు వస్తాయి కానీ వీళ్లు అవేవీ చెయ్యలేదు.

ఇలా ఎలాంటి అవినీతికి పాల్పడకపోయినా ఏ విధమైనటువంటి హత్యలు చేయకపోయినా రాత్రికి రాత్రే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అరెస్ట్ కావడంతో ఈ అరెస్టుల వెనుక రాజకీయ కుట్ర ఉందని స్పష్టంగా అర్థమవుతుంది. గిరిజ‌న నేత జార్ఖండ్ అప్ప‌టి ముఖ్య‌మంత్రి హేమంత్ సొరేన్‌. ఇక‌, ఇప్పుడు ఢిల్లీ ముఖ్య‌మంత్రి, ఆప్ అధినేత కేజ్రీవాల్‌. ఈ ఇద్ద‌రి అరెస్టూ.. యాదృచ్ఛికం కాదు. ఇలా వీరిద్దరూ అరెస్టు కావడానికి గల కారణం బిజెపితో మిలాఖత్ కాకపోవడమే కారణమని తెలుస్తుంది.

గత ఏడాది డిసెంబర్ లో ఒక సభలో మాట్లాడి హేమంత్ బయటకు వచ్చారు. అదే సమయంలోనే కేంద్ర మంత్రి వ‌ర్గంలోని జార్ఖండ్‌కు చెందిన నాయ‌కుడు ఒక‌రు ఆయ‌న‌కు ఫోన్ చేశారు. మీరు మేం క‌లిసిపోదాం.. మాకు మీ మ‌ద్ద‌తు ఇవ్వండి.. అని ఆయ‌న అడ‌గ‌లేదు. మీరు ఇండియా కూట‌మిలో ఉన్నారు. ఈ ప్ర‌య‌త్నాలు విర‌మించుకోండి. మాతో చేతులు క‌ల‌పొద్దు. కానీ, ఇండియాలో చేర‌ద్దని చెప్పారట ఇదే విషయాన్ని ఈయన మీడియా సమావేశంలో చెప్పడంతో మరుసటి రోజు నుంచి ఈయనపై ఈడి అధికారులు భారీ స్థాయిలో సోదాలు నిర్వహిస్తూ అరెస్టు చేశారు.

ఇక ఢిల్లీ ముఖ్యమంత్రి విషయంలో కూడా అదే జరుగుతుంది ఢిల్లీ లిక్కర్స్ క్యాంప్ లో ఈయనకు ఏ విధమైనటువంటి ప్రమేయం లేదు ఎలాంటి అవినీతి సొమ్ము తీసుకోలేదు చేసిన వారిని ప్రోత్సహించను లేదు కానీ మమ్మల్ని బీజేపీతో కలిసి పోవాలని ఒత్తిడి తెస్తున్నారని బిజెపితో కలిస్తే కేసులు కూడా ఉండవని చెబుతున్నారు అంటూ చెప్పడమే ఈయన పాలిట శాపంగా మారి రాత్రికి రాత్రి అరెస్ట్ అయ్యారు ఇలా ఎవరైతే బిజెపిని టార్గెట్ చేస్తారో వారందరికీ ఇలాంటి శిక్ష తప్పదని ఆ స్థానంలో ముఖ్యమంత్రులు ఉన్న శిక్ష తప్పదు అంటూ తాజాగా ఈ ఇద్దరి అరెస్ట్ ద్వారా తెలియజేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -