Operation Akarsh: ఒక్కో అసెంబ్లీ స్థానానికి 5 కోట్ల రూపాయల బడ్జెట్.. వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్ లెక్కలివేనా?

Operation Akarsh: వందల కోట్ల రూపాయలు బడ్జెట్ తో వైసీపీ ప్రభుత్వం వైసీపీ ఆపరేషన్ ఆకర్ష కార్యక్రమానికి తెరలేపింది. ఈ కార్యక్రమం ద్వారా పెద్ద ఎత్తున టిడిపి నుంచి టికెట్లు కోల్పోయిన వారు అలాగే జనసేన ఇన్చార్జిలను టార్గెట్ చేస్తూ వచ్చారు. ఇప్పటికే ఎంతోమంది తెలుగుదేశం జనసేన పార్టీలో ఉన్నటువంటి కీలక నాయకులు వైసిపి పార్టీలోకి వస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా వీరంతా పార్టీలోకి చేరుతున్నారు అంటే స్వచ్ఛందంగా చేరడం లేదని వారి వెనుక నోట్లు కట్లు అందడంతో పార్టీలోకి అడుగుపెడుతున్నారని తెలుస్తోంది.

ఇలా ఈ పథకం కింద జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున డబ్బును విడుదల చేశారు ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం 5 కోట్ల వరకు ఈయన విడుదల చేశారని తెలుస్తోంది. ఏ పార్టీ నుంచి అయితే టికెట్ ఆశించి టికెట్ లేకుండా ఉంటారు అలాంటి వారిని టార్గెట్ చేస్తూ వచ్చారు. వీరికి స్వయంగా ఫోన్లు చేసి బేరసాలలో ఆడటం మొదలుపెట్టారు ఇంకా కుదరకపోవడంతో స్వయంగా ఆ నేతలను కలిసి డబ్బులను ఆఫర్ చేస్తూ ఉండటం విశేషం.

ఈ విధంగా ఏ నాయకుడైన డబ్బుకు లొంగిపోతే వారిని వెంటనే తాడేపల్లి పాలేసుకు తీసుకువెళ్లి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా కండువా కప్పించి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి నాయకులు స్థితిని బట్టి వారికి డబ్బులు డిమాండ్లు చేస్తున్నారని స్పష్టంగా అర్థం అవుతుంది అయితే ఎక్కువగా జనసేన వాలంటీర్లను టార్గెట్ చేశారని తెలుస్తుంది. ప్రతి నియోజకవర్గంలోనూ జనసేన పార్టీ తరఫున వాలంటీర్లు ఉన్నారు అయితే పొత్తులో భాగంగా జనసేనకు కేవలం 21 సీట్లు మాత్రమే వచ్చాయి.

ఇలా 21 సీట్లు రావడంతో ఎంతోమంది ఈ పార్టీ కోసం కృషి చేసిన వారందరూ కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటివారిని వైసీపీ ప్రభుత్వం అవకాశంగా చేసుకొని వారిని తమ పార్టీలోకి ఆహ్వానించాలని పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు అయితే వీరందరూ కూడా పార్టీలోకి స్వచ్ఛందంగా రావడం లేదని కేవలం నోట్లకట్లు మార్పిడి కారణంగానే అడుగుపెడుతున్నారని తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -