Chandrababu: చంద్రబాబు, భువనేశ్వరి రేంజ్ లో మీరు కష్టపడలేరా.. పార్టీని గెలిపించుకోవాఅలనే ఆలోచన లేదా?

Chandrababu: ఆంధ్రప్రదేశ్ లో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలను మొదలుపెట్టారు. ఈ ప్రచార కార్యక్రమాలలో భాగంగా వైఎస్ఆర్సిపి పార్టీ నేతలు అందరూ కూడా పెద్ద ఎత్తున ప్రజలలోకి వస్తూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రచార కార్యక్రమాలకు బ్రేక్ ఇచ్చారు. అయితే ప్రస్తుతం ఈయన పిఠాపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు.

ఇక చంద్రబాబు నాయుడు ఏడు పదుల వయసులో ఉంటూ ఎండలను సైతం పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మరోవైపు నారా భువనేశ్వరి కూడా నిజం గెలవాలి అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇలా వీరిద్దరూ ఎండలను లెక్కచేయకుండా ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తూ ఉండగా మరి కొంతమంది టిడిపి నేతలు పార్టీ ఆఫీస్ వదిలి బయటకు రావడం లేదు.

ఇలా పార్టీ ఆఫీసులో కూర్చుని ప్రెస్ మీట్ లు పెడుతూ ప్రచారాలు నిర్వహిస్తున్నారు తప్ప ప్రజలల్లోకి మాత్రం రావడం లేదు. ఇలా ప్రజలలోకి రాకపోతే పార్టీ విజయం ఎలా అవుతుందన్న సందేహాలు అందరిలోనూ కలుగుతున్నాయి. ఈ విషయంపై పలువురు నేతలు కార్యకర్తలు స్పందిస్తూ చంద్రబాబు నాయుడు నారా భువనేశ్వరి మాదిరిగా బయటకు వచ్చి ప్రచార కార్యక్రమాలను చేయలేరా అసలు పార్టీని గెలిపించుకోవాలనే ఉద్దేశం ఉందా లేదా అన్న సందేహాలను కూడా వ్యక్తం చేస్తున్నారు.

టిడిపి, జనసేన, బీజేపీల కూటమిలో బీజేపీ ఉన్నప్పటికీ లేనట్లే వ్యవహరిస్తోందని చెప్పక తప్పదు. టిడిపి, జనసేనలు పొత్తులు ఖరారు చేసుకోగానే రెండు పార్టీల నేతలతో సమన్వయ కమిటీలు వేసుకొని ఉమ్మడి కార్యాచరణ చేపడుతుండేవి. ఎన్నికలకు కొద్దిరోజుల సమయం ఉండగా ఈ మూడు పార్టీలు కలిసి ఎక్కడ బహిరంగ సభలను నిర్వహించకపోవడం అందరిని ఆందోళనకు గురిచేస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -