GVL Narasimha Rao: విశాఖ ఎంపీ సీటు గురించి జీవీఎల్ సంచలన వ్యాఖ్యలు.. ఏం జరిగిందంటే?

GVL Narasimha Rao: త్వరలోనే ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఎన్నికల హడావిడి మొదలైంది. అయితే ఏపీలో వైఎస్ఆర్సిపి పార్టీ సింగిల్ గా పోటీ చేస్తుండగా తెలుగుదేశం జనసేన బిజెపి కూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలోకి దిగుతోంది. ఇలా కూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలోకి దిగడంతో చాలామందికి అనుకున్న చోట్ల టికెట్లు రాకపోవడంతో పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

ఇలా కూటమిలో భాగంగా విశాఖ బీజేపీ అభ్యర్థిగా కొనసాగుతూ ఉన్నటువంటి జీవీఎల్ నరసింహారావుకి సీటు రాకపోవడం గమనార్హం. ఈయన గత కొన్ని సంవత్సరాలుగా విశాఖలోనే పర్యటిస్తూ బిజెపి పార్టీనీ బలోపేతం చేశారు. ఇక విశాఖలో తనకే సీటు వస్తుందని ఈయన భావించినప్పటికీ తనకు మాత్రం సీటు కేటాయించకపోవడం పట్ల నిరాశ వ్యక్తం చేశారు ఇక ఇదే విషయం గురించి ఈయన మీడియా సమావేశంలో మాట్లాడారు.

తాను విశాఖలో ఉంటూ బిజెపి పార్టీని బలోపేతం చేశాను అలాంటిది తనకు ఇక్కడ టికెట్ ఇవ్వకుండా బిజెపికి ఏమాత్రం బలం లేని చోట టికెట్ ఇస్తామని చెప్పడం సమంజసం కాదని వెల్లడించారు. ఒక కుటుంబం పట్టుదల కారణంగానే తనకు విశాఖ సీటు పోయిందని ఈయన వెల్లడించారు.

రాజకీయాలలో సీట్లు కేటాయించడం అనేది అభ్యర్థుల బలాలను బట్టి కాకుండా సీట్లు కేటాయించడం కూడా ఒక వ్యాపారంగా మారిపోయిందని తెలిపారు. ఇలా సీట్లు కేటాయించడం మంచి పద్ధతి కాదని తెలిపారు. ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాదిలో ధన ప్రవాహం అధికంగా ఉందని ఈయన తెలిపారు. రాజకీయాలు అంటే ఎన్నికలలో గెలిచి ప్రజలకు సేవ చేయడమే కానీ వ్యాపారాలు చేయటం కాదు అంటూ ఈయన పరోక్షంగా సెటైర్లు వేశారు. దీంతో ఈయన వ్యాఖ్యలు కాస్త సంచలనంగా మారాయి. అయితే ఈయనకు సీటు రాకపోవడానికి గల కారణం ఏంటి అనే విషయాన్ని స్పష్టంగా చెప్పకనే చెప్పేశారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -