TDP In Kadapa : కడప కోటకు బీటలు.. ఈ ఎన్నికల్లో కడపలో టీడీపీకే అనుకూల ఫలితాలు వస్తాయా?

TDP In Kadapa: ఏపీలో కడప జిల్లా రాయలసీమ రాజకీయాలు ఎప్పుడూ వైసీపీకి అనుకూలంగా ఉంటాయి. అందులోనూ కడప వైసీపీ కంచుకోటలా ఉంటుంది. మొదటి నుంచి అక్కడ కాంగ్రెస్ పాగా వేసేంది. రాజశేఖర్ రెడ్డి సొంత నియోజవర్గం కావడంతో టీడీపీ గాలి కూడా కనిపించేది కాదు. రాష్ట్ర విభజన తర్వాత కడప ప్రజలు వైసీపీని ఆదరించారు. 2014 ఎన్నికల్లో టీడీపీ రాజంపేట స్థానం మాత్రమే గెలుచుకుంది. 2019కి వచ్చే సరికి వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. అక్కడ టీడీపీ ఖాతా కూడా తెరవలేదు. అయితే, ఈ సారి కడప జిల్లాలో టీడీపీ కాస్త మెరుగైందని చెప్పొచ్చు. అలా అని మెజార్టీ స్థానాలు గెలుచుకుంటుందని చెప్పలేం.

ఇప్పటికప్పుడు ఎన్నిలకలు జరిగితే మైదకూరు టీడీపీ ఖాతాలో పడుతుంది. ఇక.. రాజంపేట, కమలాపురంలో టీడీపీకి కొంచెం ఎడ్జ్ ఉంది. మిగిలిన చోట్ల వైసీపీ బలంగా ఉంది. కానీ, జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా టీడీపీ ఓట్ బ్యాంక్ పెంచుకుంటుంది. రాష్ట్రవ్యాప్తంగా ఇంత వ్యతిరేకత వ్యక్తం అవుతున్నా.. కడపలో మాత్రం వైసీపీ బలంగా ఉండటానికి కారణం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసత్వాన్ని జగన్ కొనసాగిస్తున్నారు. కానీ, కడప ఎంపీ స్థానం విషయంలో వైసీపీకి సవాల్ ఎదురుకావొచ్చనే అభిప్రాయం ఉంది. ఎందుకంటే.. అక్కడ కాంగ్రెస్ తరుఫున వైఎస్ షర్మిల పోటీ చేస్తుంది. రాజశేఖర్ రెడ్డి వారసత్వాన్ని ఆమె సవాల్ చేస్తుంది. వైసీపీ తరుఫున అవినాష్ రెడ్డి పోటీ చేస్తున్నారు. వివేకాహత్యకేసు విషయంలో ఆయనపై తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతోంది. షర్మిల దాన్నే ప్రధాన అస్త్రంగా వాడుకునంటున్నారు.

వివేకాహత్యకేసులో బాధితులుగా ఉన్న సునీత, సౌభాగ్యమ్మ షర్మిలకు సపోర్టు చేస్తున్నారు. దీంతో.. వైసీపీ ఓట్ బ్యాంక్ ను షర్మిల గట్టిగా కొల్లగొడుతుందని విశ్లేషణలు వస్తున్నాయి. వివేకాను అవినాష్ రెడ్డే హత్య చేయించారని కడప ప్రజలు నమ్ముతున్నారు. అంతేకాదు.. ఈ కేసులో హంతకుడు కూడా అదే విషయం చెప్పాడు. అవినాష్ రెడ్డి చెప్పడం వలనే చంపానని అన్నారు. దీంతో.. వైఎస్ అభిమానుల్లో కొంత అసంతృప్తి అవినాష్ రెడ్డిపై కనిపిస్తోంది. అయితే, ఈ ఎన్నికల్లో షర్మిల గెలిచే అవకాశం లేదు కానీ.. వైసీపీ ఓట్లు చీల్చడం వలన అది పరోక్షంగా టీడీపీకి లాభం జరిగే అవకాశం ఉంది. ఇలా చూసుకుంటే కడప ఎంపీగా టీడీపీ గెలిచే అవకాశాలను కొట్టి పారేయలేం.

ఎమ్మెల్యేలుగా జిల్లా వ్యాప్తంగా మూడు స్థానాలే గెలుచుకునే అవకాశం ఉన్నప్పటికీ.. ఎంపీగా గెలవడానికి టీడీపీకి అవకాశాలు మెండుగా ఉన్నాయి. కానీ, షర్మిల పనితనంపైనే టీడీపీ గెలుపు ఆదారపడి ఉంది. ఎలా చూసుకున్నా టీడీపీ కడపలో బలపడుతుందనేది నిజం. ప్రభుత్వ వ్యతిరకత కొంత కలిసి వస్తుండగా.. షర్మిల బలపడటం టీడీపీకి కలిసి వస్తుంది. గత ఎన్నికలులా ఖాతా తెరవని పరిస్థితి ఉంది. ఓ రకంగా చెప్పాలంటే.. సీట్లు సంఖ్యను పక్కన పెడితే.. ఈ సారి మంచి ఓట్ బ్యాంక్ టీడీపీ తీసుకుపోతుందిన చెప్పడంలో అనుమానం లేదు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -