Attacks On Leaders: ఎన్నికల సమయంలోనే ఏపీలో దాడులు.. ప్లాన్ ప్రకారమే దాడులు జరుగుతున్నాయా?

Attacks On Leaders: ఎన్నికల సమయం దగ్గర పడుతున్న సమయంలో వైసీపీ కొత్త కొత్త ప్లాన్ లు వేస్తోంది. ఎన్నికల్లో గట్టేక్కేందుకు ఒక కొత్త వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లు స్పష్టం అవుతోంది. కాగా గత ఎన్నికల సమయంలో కోడి కత్తి అంటూ సానుభూతి కోసం పెద్ద ప్లాన్ చేయగా అది బాగా వర్క్ అవుట్ అయింది. ఇక ఈసారి వైట్ నాట్ 175 అంటూ గంభీర్యం ప్రదర్శిస్తోన్న వైసీపీకి అడుగడుగునా చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. జగన్ బస్సుయాత్ర పై ఆ పార్టీ అభ్యర్థులు గంపెడు ఆశలు పెట్టుకున్నారు.

కానీ బస్సు యాత్ర మాత్రం పేలవంగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే జగన్ పై శనివారం రాత్రి దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఎప్పటిలాగే వైసీపీ నేతలు గుండెలు బాదుకునేంత పని చేశారు. స్కిప్ట్ మేరకు టీడీపీ,జనసేనపై ఆరోపణలు చేశారు. గత ఎన్నికలకు ముందే ప్లాన్ వర్క్ అవుట్ అయ్యింది కదా అని ఈ ఎన్నికల ముందు కూడా ఏదో ఒక ప్లాన్ వేసి వర్కౌట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు వైసీపీ నేతలు. కోడికత్తి డ్రామాకు బదులుగా ఈసారి గులకరాయి డ్రామాను షురూ చేశారన్న అనుమానాలు వచ్చాయి. ఎందుకు సరిగ్గా ఎన్నికల సమయంలోనే జగన్ పై దాడులు జరుగుతున్నాయి.

ఎన్నికల సమయంలో మాత్రమే జగన్ జనాల్లో ఉంటున్నారా? అంటే అది కూడా లేదు. అయినా భారీ బందోబస్తు మధ్య ఉండే జగన్ పై దాడి ఎలా జరిగింది? ఇది ఐ ప్యాక్ ప్లాన్ అనే సందేహాలు కలుగుతున్నాయి. జగన్ పై దాడి జరిగిన ఒక రోజు వ్యవధిలోనే పవన్ , చంద్రబాబులపై దాడికి యత్నించడం పలు సందేహాలకు కారణం అవుతోంది. ఒక్క జగన్ పైనే ఎన్నికలకు ముందు దాడులు ఎలా జరుగుతున్నాయన్న ప్రశ్నలు వెలుగులోకి వస్తుండటంతో, చంద్రబాబు, పవన్ పై దాడులకు ప్లాన్ జరిగిందా? అనే కోణంలో చర్చలు కూడా జరుగుతున్నాయి. ఇలా మొత్తంగా చూసుకుంటే సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్లాన్ల ప్రకారమే ఇదంతా జరుగుతోంది అని బాగా స్పష్టంగా అర్థం అవుతోంది..

tps://www.telugu360.com/te/why-are-the-attacks-happening-in-ap-during-the-elections/

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -