YSRCP: ఆ సర్వేలను నమ్ముకుంటే వైసీపీ కథ కంచికే.. ఆ మాటలు నమ్మితే నిండా మునిగినట్లే?

YSRCP: ఇప్పటివరకు వచ్చిన సర్వేల ఫలితాలు రోజురోజుకీ వైసీపీలో ఉత్సాహాన్ని పెంచుతున్నాయి. అలాగే ప్రత్యర్థి వర్గాల్లో గుబులు పుట్టిస్తున్నాయి. దీనికి కారణం ఏమిటంటే జాతీయస్థాయిలో బీజేపీ ది, ఏపీలో వైసీపీ ది అధికారం అని తేల్చి చెప్తున్నాయి చాలా మటుకు సర్వేలు. అయితే ఈ సర్వేల విషయంలో వైసీపీ భుజాలు ఎగరేయటం మానేసి జాగ్రత్త పడవలసిన అవసరం ఎంతైనా ఉంది. సర్వేల్లో ఎలాగో మనమే గెలుస్తామనే రిలాక్స్ అయిపోకుండా అప్రమత్తంగా ఉండడం చాలా అవసరం.

ఎందుకంటే రెండు మూడు నెలల క్రితం ఇవే సంస్థలు ఏపీలో రాజకీయ పరిస్థితులపై సర్వేలు నిర్వహించి టీడీపీ గ్రాఫ్ పెరిగినట్లు వైసపీ గ్రాఫ్ బాగా పడిపోతున్నట్లు స్పష్టం చేశాయి. టీడీపీ ఈసారి అధికారంలోకి రాకపోతే ఆ పార్టీకి భవిష్యత్తు ప్రశ్నార్ధకమే, ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ఆయన గత పది ఏళ్లుగా గెలుపు ఓటములతో సంబంధం లేకుండా, ఎన్నికల్లో పోటీ చేయకుండా అలాగే పోటీ చేసే గెలవకుండానే హాయిగా ఆయన కార్యకలాపాలు ఆయన చెక్కపెట్టుకుంటున్నారు.

ఇలాంటి సమయంలో వైసీపీ గెలుపు దీమాతో రిలాక్స్ అయితే అసలుకే ముప్పు వస్తుంది. ఎందుకంటే ఇప్పటికే కొందరు వైసీపీ అభ్యర్థులు క్షేత్రస్థాయిలో తమ శ్రేణులని పట్టించుకోవడం లేదని సొంత పార్టీ నాయకులే చెబుతున్నారు. వైసీపీ అధికారంలోకి వస్తుందని చాలామంది అభిప్రాయపడుతున్నారు అంటే వైసీపీ ప్రభుత్వం ఏదో అద్భుతాలు చేసిందని కాదు, అలాగే వైయస్ జగన్ అద్భుత వ్యూహాలు రచించాడని కాదు. ప్రత్యర్థి కూటమిలోని వస్తున్న విభేదాలే వైసీపీ కి బలాన్ని చేకూరుస్తున్నాయి.

టీడీపీ జనసేన పొత్తు కలిసినప్పుడు రాజకీయాలు ఒకరకంగా ఉన్నాయి, వీరికి బీజేపీ జతకావడంతో వైసీపీకి రాజకీయంగా చాలా లాభం జరిగింది. ఈ మూడు పార్టీలు కూటమిగా ఏర్పడటం వలన 20 నుంచి 25 అసెంబ్లీ నియోజకవర్గాలను అప్పనంగా వైసీపీ చేతిలో పెట్టినట్లు అయింది. దాంతో వైసీపీ కి ధీమా కలగకుండా ఎలా ఉంటుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఏదైనా వైసీపీకి ఇది ఆచితూచి అడగాల్సిన సమయం.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -