Ys Jagan Stone Attack Case: జగన్ రాయి కేసులో లీకులతో వైసీపీ పరువు పోయిందా.. ఈ ఎన్నికల్లో వచ్చే ఓట్లు కూడా రావా?

Ys Jagan Stone Attack Case: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో పోలీసులు ముమ్మర దర్యాప్తు చేసి జగన్ పై రాయి విసిరిన యువకుడిని పట్టుకున్నారు. ఇదంతా పోలీసుల భద్రత వైఫల్యం వల్లే జరిగిందంటూ పోలీసులని చేతకాని వాళ్లుగా చిత్రీకరించడాన్ని పోలీసులు సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. అందుకే సదరు వ్యాఖ్యలకు చెక్ పెడుతూ ఒక వీడియోను కూడా లీక్ చేశారు పోలీసులు.

అంతేకాదు సదరు యువకుడిని ఎందుకు బాటిల్ విసిరావు అని ప్రశ్నిస్తే క్వార్టర్ బాటిల్, 350 రూపాయల రొక్కం ఇస్తామని చెప్పి ఇక్కడకు తీసుకువచ్చారు. కానీ బాటిల్ ఇచ్చి డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోయారు ఆ కోపంతోనే రాయి విసిరానని యువకుడు చెప్పాడనే విషయాన్ని కూడా పోలీసులు లీక్ చేసినట్లు సమాచారం. ఈ రాజకీయ పార్టీలు ఆడే పొలిటికల్ డ్రామాలలో పోలీసులు తీవ్ర ఒత్తిడికి గురవుతారనే విషయం అందరికీ తెలిసిందే.

తప్పుడు పనులు చేసి అధికార పక్షానికి తొత్తులుగా వ్యవహరిస్తే వచ్చే ఎన్నికలలో ప్రతి వర్గం అధికారంలోకి వస్తే ఇదే పోలీసులకి తాటతీస్తుంది ఆ ప్రభుత్వం. విచారణ కచ్చితంగా వీడియో తీసి ఉంటారు కాబట్టి రికార్డుల్లో కూడా ఉంటుందనే భయం పోలీసులలో నెలకొని ఉంది. అందుకే వారి చేతికి మట్టి అంటకుండా ముందు జాగ్రత్త పడ్డారు పోలీసులు. అయితే జగన్ పై వచ్చే విమర్శలను సాక్షి మీడియా అంత త్వరగా తీసుకోదు.

వాటిని అబద్దం అని చూపించే ప్రయత్నం చేస్తుంది. అయితే ఈసారి సాక్షి మీడియా కూడా అది అబద్ధమని చెప్పలేదు ఎందుకంటే పోలీసుల నుంచి వచ్చిన లీక్ కావటంతో సాక్షి మీడియా కి జగన్ని వెనకేసుకొచ్చే అవకాశం లేకుండా పోయింది. మరోవైపు నారా లోకేష్ జగన్ ని ఎద్దేవా చేస్తూ డబ్బులు ఇవ్వకపోతే మండదా చెల్లి, మండదా అక్క అంటూ జగన్ స్టైల్ లోనే ట్వీట్ చేయటం కొసమెరుపు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -