YS Avinash Reddy: సునీత సాక్ష్యాలకు పాత ఆరోపణలే కౌంటర్.. అవినాష్ రెడ్డి నిండా మునుగుతున్నారా?

YS Avinash Reddy About: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాబాయి అయిన వైయస్ వివేకానంద రెడ్డి హత్య విషయంలో నిజా నిజాలు తేల్చాలంటూ వివేకానంద రెడ్డి కూతురు సునీత రెడ్డి పోరాడుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇదే విషయం గా వివేకాను ఎంత దారుణంగా హత్య చేశారో వివరిస్తూ మీడియా ప్రతినిధుల ముందు ఆమె ప్రజెంటేషన్ కూడా ఇచ్చిందన్న విషయం తెలిసిందే. అంతేకాకుండా వివేకా హత్య గురించి సునీత మరికొన్ని ఆధారాలు బయట పెట్టడంతో వైసీపీ డిఫెన్స్ లో పడింది.

అయితే ఈ విషయంపై అవినాష్ రెడ్డి స్పందించారు. వివేకాను చంపిన దస్తగిరి తో కుమ్మక్కైన సునీత అతడిని అప్రూవల్ గా మార్చి తనపై రాజకీయంగా బురద జల్లుతున్నారని ఆరోపించారు. గూగుల్ మ్యాప్స్, గూగుల్ టేక్ అవుట్ రెండు ఒకటే అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారని, గూగుల్ టేక్ అవుట్ శాస్త్రీయతను గూగుల్ సంస్థ కూడా నిర్ధారించలేదని చెప్పారు. ఈ సంఘటనకు ప్రత్యక్ష సాక్షి వాచ్మెన్ రంగన్న. ఆయన నలుగురు పేర్లు చెప్పినా వారిని వెంటనే అరెస్టు చేయలేదని చెప్పారు.

ఉద్దేశపూర్వకంగానే సునీత తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని తను ప్రశ్నలకు సునీత బదులు చెప్పాలని అవినాష్ రెడ్డి చెప్పుకొచ్చారు. అయితే ఈ ఆరోపణలన్నీ పాతవే అని కనీసం సునీత ఆధారాలు బయటపెట్టి చేసిన ఆరోపణలకు సమాధానం ఇచ్చే ప్రయత్నం కూడా అవినాష్ రెడ్డి చేయకపోవడం గమనార్హం. తన నెంబర్ ఎన్నో వాట్సాప్ గ్రూపులో ఉంటుందని యాక్టివ్ గా ఉంటే తన పాత్ర ఉన్నట్లేనా అని ఎదురుదాడి చేసేందుకు ప్రయత్నించారు.

మొబైల్లో వైఫై వాడితే ఒక రకంగా డేటా వాడితే ఒక రకంగా చూపెడుతుందని, 100 మీటర్ల నుంచి కిలోమీటర్ అంత దూరం తేడా కనిపిస్తోందని చెప్పారు. నిజానికి హత్య జరిగిన తరువాత జగన్ కి రాజకీయంగా ఇబ్బంది అవుతుందని సజ్జన స్టేట్మెంట్లను ప్రెస్మీట్లో సునీతతో చదివించారు వైసీపీ నేతలు, ఇప్పుడు అవినాష్ అదే అసలు స్టేట్మెంట్ అని వాదిస్తున్నారు. ఈ వ్యవహారం అంతా చూస్తుంటే అవినాష్ రెడ్డి నిండా మునిగినట్లే కనిపిస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -