Note for Vote Case: ఓటుకు నోటు కేసును కావాలనే తెరపైకి తెస్తున్నారా.. చంద్రబాబును కావాలనే టార్గెట్ చేస్తున్నారా?

Note for Vote Case:  ఓటుకు నోటు కేసు రెండు తెలుగు రాష్ట్రాలలో అప్పట్లో ఎలాంటి సంచలనాలను సృష్టించినదో మనకు తెలిసిందే. ఇలా ఓటుకు నోటు కేసులో భాగంగా చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి పేరులో మారుమోగిపోయాయి. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేసేందుకు నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు టీడీపీ డబ్బు ముట్టజెప్పాలని చూసింది. ఈ క్రమంలోనే అప్పటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి స్టీఫెన్‌సన్ ఇంటికి డబ్బు సంచులతో వెళ్లి.. ఏసీబీ అధికారులకు దొరికిపోయారు.

ఇందులో భాగంగా రేవంత్ రెడ్డి నోట్ల కట్టుతో స్పష్టంగా కనిపించడమే కాకుండా చంద్రబాబు నాయుడుతో మాట్లాడినటువంటి ఆడియో ఫుటేజ్ కూడా స్పష్టంగా ఉండడంతో ఈ విషయం సంచలనగా మారింది.ఆ తరువాత జరిగిన పరిణామాలతో ఈ కేసు మరుగున పడింది. అయితే తాజాగా మరోసారి ఓటుకు నోటు కేసు తెర పైకి తీసుకువస్తున్నారు.

ఏపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో మరోసారి ఓటుకు నోటు కేసు ప్రస్తావనకు రావడంతో ఈ విషయం కాస్త తెలుగుదేశం పార్టీకి ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ మీద ఉన్నారు. ఇటీవలే బెయిల్ షరతులను ఉల్లంఘించొద్దంటూ హైకోర్టు చంద్రబాబుకు ఆదేశాలు కూడా జారీ చేసింది.

ఇప్పటికే స్కిల్ డెవలపర్ స్కాంలో అరెస్టయి బెయిల్ మీద బయటకు వచ్చినటువంటి బాబు ఎన్నికల ప్రచారంలో ఉన్నటువంటి తరుణంలో తిరిగి ఓటుకు నోటు కేసును మరోసారి ప్రస్తావనకు తీసుకురావడంతో తెలుగు తమ్ముళ్లలో ఆందోళన నెలకొంది. ఇలా మరుగున పడినటువంటి ఓటుకు నోటు కేసు మరోసారి ప్రస్తావనకు తీసుకురావడం చూస్తుంటే కావాలని చంద్రబాబును టార్గెట్ చేశారని పలువురు ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -