Uttar Pradesh: కాబోయే భార్యతో మాట్లాడుతుండగా కొందరు యువకులు వచ్చి.. ఏం జరిగిందంటే!

Uttar Pradesh: నేటి సమాజంలో దయా దాక్షిణం మానవత్వం లేకుండా పోయాయి. మహిళలు కనిపిస్తే చాలు పశువుల్లాగా ప్రవర్తిస్తున్నారు. మనిషులమనే ధ్యాసను మరిని సైకోల్లా మారి వారి ప్రవర్తనతో ఇతరుల ప్రాణాలు పోతున్నాయి. కొన్నిసార్లు వారి తీరు చూస్తే అక్కడికక్కడే చంపేయాలనేంత కోసం వస్తోంది. అలాంటి వారిని పలుమార్లు జైలుకు తరలించినా వారిలో మార్పు రావడం లేదు. తాజాగా ఉత్తర్‌ ప్రదేశ్‌లో జరిగిన ఘటన తలుచుకుంటే కట్టలు తెంచుకునే కోపాన్ని తీసుకోస్తోంది. కొందరు యువకులు ఓ యువతిని తనకు కాబోయే భర్త ముందే అసభ్యకరంగా ప్రవర్తించారు. మాకు నిశ్చితార్థం జరిగింది. తను నాకు కాబోయే భార్య దయచేసి మమ్మల్ని మమ్మల్ని వదిలిపెట్టండని కాళ్లు పట్టుకుని బతిమిలాడినా కనికరించలేదు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

ఉత్తరప్రదేశ్‌లోని మౌయిమా అనే ప్రాంత పరిధికి చెందిన యువతికి, సొరాన్‌కు చెందిన యువకుడితో నిశ్చితార్థం జరిగింది. త్వరలో వీరి వివాహం జరగనుంది. ఇదిలావుండగా, బుధవారం కాబోయే భార్యను చూసేందుకు ఆ యువకుడు మౌయిమాకు వచ్చాడు. ఇద్దరూ నిర్మానుష్య ప్రదేశంలో మాట్లాడుకుంటుండగా కొందరు యువకులు అక్కడికి వచ్చారు. యువతి చేయి పట్టుకుని అసభ్యకరంగా ప్రవర్తించడంతో పాటు ఆమె ఒంటిపై దుస్తులను కూడా లాగేందుకు ప్రయత్నిస్తాడు. దీంతో యువతికి కాబోయే భర్త.. అతడి కాళ్లు పట్టుకుని వేడుకుంటాడు.

‘మాకు నిశ్చితార్థం జరిగింది తను నాకు కాబోయే భార్య మమ్మల్ని వదిలేస్తే వెళ్లిపోతాం అంటూ వేడుకుంటాడు. అయినా కూడా వారు ఏమాత్రం జాలి, దయ లేకుండా యువతి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. మమ్మల్ని వదలండని యువతి వేడుకుంటున్నా కూడా చాలా సేపు ఆమెను వేధిస్తాడు. ఈ ఘటనను అక్కడే ఉన్న మరో వ్యక్తి వీడియో తీసి, సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్‌ కావడంతో పోలీసులు స్పదించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని త్వరలోనే నిందితులను పట్టుకుని కఠిన చర్యలు తీసుకుంటామని బాధిత కుటుంబానికి హామీ ఇచ్చారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -