Pawan Kalyan-Mahesh Babu: మ‌హేష్ ఫ్యాన్స్ క‌ల నెర‌వేరింది….ఇక ప‌వ‌న్ ఫ్యాన్స్ వంతు

Pawan Kalyan-Mahesh Babu సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీస్ అని చెప్ప‌గానే అందిరికీ గుర్తొచ్చేవి పోకిరి, ఒక్క‌డు. ఈ రెండు సినిమాలు సూప‌ర్ స్టార్ కెరీర్ ను ఓ రేంజ్ కి తీసుకెళ్ళిన మూవీస్. మ‌హేష్ కు విప‌రీత‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ పాటు క్రేజ్ ని తెచ్చిపెట్టాయి. ది ప్రిన్స్, సూప‌ర్ స్టార్ అంటూ ఫ్యాన్స్ త‌మ అభిమాన హీరోకి త‌మ గుండెల్లో ఓ ప్ర‌త్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు.

మ‌హేష్ బాబు పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈ రెండు బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీస్ ను మ‌ళ్ళీ రీ రిలీజ్ చేయాల‌నేది అభిమానుల క‌ల‌. దీనికోస‌మే ఈ రెండు సినిమాల‌ను హైద‌రాబాద్ లోని ప‌లు ధియేట‌ర్ల‌లో 4కే లో విడుద‌ల చేశారు. మ‌హేష్ కొత్త సినిమా రిలీజ్ రోజున జ‌రిగినంత‌గా ఓ మాస్ జాత‌ర వాతావ‌ర‌ణం ధియేట‌ర్ వ‌ద్ద నెల‌కొంది.  రోజూ టీవీలో చూసే సినిమాని కూడా టిక్కెట్టు కొనుక్కుని థియేట‌ర్ కు వెళ్ళిచూస్తూ పూన‌కాలతో ఊగిపోయారు ఫ్యాన్స్.  విజిల్స్ వేస్తూ, పేప‌ర్లు విసురుతూ, డ్యాన్సులు చూస్తూ త‌మ హీరో పై అభిమానాన్ని చాటారు.

Pawan Kalyan - Mahesh Babu
Pawan Kalyan Mahesh Babu Fans Waiting for that day

అయితే ఇదంతా ఇప్పుడు ఒక కొత్త ట్రెండ్ కు దారితీసేలా కనిపిస్తోంది. ప‌వ‌న్ ఫ్యాన్స్ కూడా ఇప్పుడు ఇదే దారిలో న‌డ‌వ‌నున్నారు. మాకేం త‌క్కువ అన్న‌ట్లుగా ప‌వ‌న్ కెరీర్ లో బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచిన జ‌ల్సా చిత్రాన్ని కూడా 4కే లోకి మార్చి మ‌రో సారి రీరిలీజ్ చేయ‌నున్నారు.

సెప్టెంబ‌ర్ 2 ప‌వ‌ర్ స్టార్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా జ‌ల్సా సినిమాని విడుద‌ల చేసేలా ప్లాన్ చేస్తున్నారు ఫ్యాన్స్.ఇదే జ‌రిగితే మ‌రోసారి ప‌వ‌న్ ఫ్యాన్స్ దెబ్బ‌కు థియేట‌ర్లు ద‌ద్ద‌రిల్లిపోయేలా క‌నిపిస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -