Health Tips: ఒక్క జొన్నరొట్టెతో ఆ సమస్యలకు చెక్?

Health Tips: జొన్నరొట్టె వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్న విషయం అందరికీ తెలిసిందే. పూర్వం రోజుల్లో ఈ జొన్న రొట్టెలను బాగా తినేవారు. కానీ రాను రాను ఈ జొన్న రొట్టెలు తినే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. బయట కూడా మనకు చాలా తక్కువగా ఇవి లభిస్తూ ఉంటాయి. కాగా జొన్న రొట్టెలు రకాల ఆరోగ్య ప్రయోజనాలను చేకూర్చడంతోపాటు కొన్ని రకాల వ్యాధులను నయం చేస్తాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ వంటి సమస్యల్ని పరిష్కరించేందుకు మొక్కజొన్న రొట్టెలు అద్భుతంగా పనిచేస్తాయి. మరి జొన్న రొట్టె వల్ల ఇంకా ఏఏ ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

జొన్నను రొట్టెలతో పాటు మొక్కజొన్న, సూప్, స్నాక్స్, కూరల రూపంలో తీసుకోవచ్చు. మొక్కజొన్న ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో మంగనీస్, పొటాషియం, జింక్, ఐరన్, ఫాస్పరస్, కాపర్, సెలేనియం, విటమిన్ ఎ వంటి పోషకాలు లభిస్తాయి. అందుకే మొక్కజొన్న తీసుకోవడం వల్ల శరీరం ఇమ్యూనిటీ పటిష్టం అవుతుంది. అంతేకాకుండా కంటి ఆరోగ్యానికి చాలా మంచిది. శరీరంలో ఏర్పడే వివిధ ప్రోటీన్, విటమిన్ లోపాన్ని సరిజేస్తుంది. కాగా శరీరంలో ఎర్ర రక్త కణాల లోపించడం వల్ల ఎనీమియా సమస్య ఏర్పడుతుంది.

 

ఈ సమస్యను నిర్మూలించేందుకు మొక్కజొన్న అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇందులో పుష్కలంగా ఉండే ఐరన్ ఎనీమియాను దూరం చేసేందుకు దోహదపడుతుంది. శరీరంలో రక్త హీనత ఏర్పడితే మొక్కజొన్నలు అద్భుతమైన పరిష్కారం చూపిస్తాయి. మొక్కజొన్నలో ఫైబర్ పెద్దమొత్తంలో ఉంటుంది. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించేందుకు మొక్కజొన్న చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మొక్కజొన్న తరచూ తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయి పెరగకుండా ఉంటుంది. ఫలితంగా గుండె సంబంధిత వ్యాధులకు ప్రయోజనకరంగా ఉంటుంది. కాగా ఇందులో ఫైబర్ మలబద్ధకం సమస్యను తొలగించేందుకు ఉపయోగపడుతుంది. మొక్కజొన్న పిండితో చేసిన రొట్టెలు తినడం వల్ల కంటి ఆరోగ్యానికి దోహదమౌతుంది. ఇందులో కైరోటినాయిడ్, విటమిన్ ఎ పెద్దమొత్తంలో ఉంటుంది. కంటి ఆరోగ్యానికి , కంటి చూపుకు చాలా మంచిది.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -