Hyderabad: వారి నిర్లక్ష్యంతో ఉదయం అదృశ్యమైన బాలిక మరుసటి రోజు శవమైంది..

Hyderabad: ఆ అమ్మాయి పదో తరగతి చదువుతోంది. ఆదివారం సెలవు కావడంతో ఇంటి వద్దనే ఉంటూ చదువుకోవాలనుకుంది. అయితే ఆ ఆరోజు ఉదయం తల్తిదండ్రలు ఉదయమే వారి వారి పనులకు వెళ్లారు. కాసేపు చదువుకుని ఆ తర్వాత ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లింది. సాయంత్రం తల్లిదండ్రులు ఇంటికి వచ్చారు. తమ కూతురు ఎక్కడికో బటయకు వెళ్లింటుందని.. మరికాసేపట్లో వచ్చేస్తుంది అనుకున్నారు.. ఎంతకీ రాకపోవడంతో ఆందోళనకు గురయ్యారు. ఆ అమ్మాయి స్నేహితురాళ్లను చుట్టుపక్కల వాళ్లను అడిగినా ఫలితం లేకపోయింది. రాత్రంతా తమ కూతురి కోసం వెతకాని చోటే లేదు. ఆ తర్వాతి రోజు ఆ అమ్మాయి సెల్లార్‌ గుంతో శవమై కన్పించడంతో ఒక్కసారిగా ఆ తల్లిదండ్రులు గుండెలు బాదుకున్న ఘటన హైదరాబాద్‌ పరిధిలోని గచ్చిబౌలిలో చోటు చేసుకుంది.

అందుకు సంబంధించిన వివరాలను స్థానిక సీఐ గోనె సురేష్‌ వెల్లడించారు. నాగర్‌ కర్నూల్‌ జిల్లాకు చెందిన నాణు– హీరాబాయి దంపతులు నగరానికి వలస వచ్చి గోపన్‌పల్లిలోని ఎన్టీఆర్‌ నగర్‌లో ఉంటున్నారు. నాణు ఆటో డ్రైవర్‌ నడుపుతుండగా, హీరాబాయి హౌస్‌మెట్‌ పని చేస్తోంది. వీరికి ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. చిన్న కూతురు రమాపతి రాణి(17) యూసూస్‌గూడలోని ప్రభుత్వ పాఠశా లలో 10వ తరగతి చదువుతోంది. ఆదివారం తల్లిదండ్రులు పనికి వెళ్లారు. ఉదయం ఇంటికి తాళం వేసి బయటికి వెళ్లిన రాణి తిరిగి రాలేదు.

కుటుంబ సభ్యులు ఆమె కోసం గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. సోమవారం తెల్లవారు జామున ఎన్టీఆర్‌నగర్‌లోని సిరీస్‌ సంస్థకు సంబంధించిన సెల్లార్‌ గుంతలో ఆమె మృతతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహన్ని బయటికి తీసి స్థానికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. 14 ఏళ్ల క్రితం సెల్లార్‌ గుంతను తవ్వి వదిలేశారని, రక్షణ చర్యలు చేపట్టకపోవడంతో ఇప్పటి వరకు ఏడుగురు మృత్యువాత పడ్డాని స్థానికులు మండిపడ్డారు.

నిర్లక్ష్యంగా వ్యవహరించిన యాజమా న్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిరసన వ్యక్తం చేశారు. సాయంత్రం 5 గంటల వరకు మృత తదేహంతో సెల్లార్‌ గుంత వద్ద ఆందోళన చేప ట్టారు. పోలీసులు ఇటు బాధితులు అటు సైట్‌ యాజమాన్యంతో చేసిన చర్చలు ఫలించ లేదు. దీంతో ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. సాయంత్రం 7 గంటల వరకు ఆందోళన కొనసాగించడంతో దిగి వచ్చిన యాజమాన్యం న్యాయం చేసేందుకు అంగీకరించడంతో వారు ఆందోళనను విరమించారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -