Kerala: అలాంటి పని చేయలేదని భార్యని కడతేర్చిన భర్త?

Kerala: ప్రస్తుత రోజుల్లో చాలామంది భార్యాభర్తలు వివాహేతర సంబంధాల మోజులో పడి పచ్చని సంసారాలను చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. తాళి కట్టిన భర్తను కాదని భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంటుండగా, భార్యను కాదని భర్త కూడా మరొక మహిళతో వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్నారు. అంతే కాకుండా వివాహేతర సంబంధాలకు అడ్డొస్తున్నారని చంపడానికి కూడా వెనకాడడం లేదు. ఇలాంటి ఘటనలు నిత్యం దేశవ్యాప్తంగా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి.. తాజాగా అందుకు పూర్తి విరుద్ధంగా ఒక వ్యక్తి ప్రవర్తించాడు.

తన భార్యని స్నేహితుడితో సంబంధం పెట్టుకోమంటూ ఆమెను వేధించాడు. చివరికి ఏం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పూర్తి వివరాల్లోకి వెళితే.. కేరళ లోని కొట్టాయంలో ఒక దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి గతంలో వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలం తర్వాత వీరికి ఇద్దరు పిల్లలు జన్మించారు. వివాహం జరిగిన తరువాత నుంచి ఎటువంటి గొడవలు లేకుండా సంతోషంగా, అన్యోన్యంగా జీవించారు. కానీ ఆ తరువాత రాను రాను ఆమె భర్త రాక్షసుడిలా మారాడు. తాళికట్టిన భార్య అని మరిచి దారుణానికి పాల్పడ్డాడు. తన స్నేహితులతో లైంగిక సంబంధం పెట్టుకోవాలంటూ భార్యని టార్చర్ చేసాడు.

 

రోజులు గడుస్తున్న కొద్ది భర్త వేధింపులు మరింత ఎక్కువ అవ్వడంతో ఆమె చేసేదేం లేక భర్తపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు భర్తను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అయితే కొన్నాళ్ల తర్వాత బెయిల్ పై విడుదల అయ్యాడు. జైల్లో చిప్పకూడు తిన్న తరువాత కూడా అతని తీరు మాత్రం మారలేదు. కొన్ని రోజుల తర్వాత తన ఫ్రెండ్స్ వద్ద పడుకోవాలంటూ మళ్లీ ఆమెను టార్చర్ చేయడం మొదలుపెట్టాడు. అందుకు భార్య నిరాకరించడంతో కోపంతో ఊగిపోయాడు. ఈ క్రమంలోనే ఇటీవల ఒక రోజు ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి భర్త భార్యను దారుణంగా హత్య చేశాడు. దీనిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు.

Related Articles

ట్రేండింగ్

RTO Padmavati: ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్ అవుతున్న ఆర్డోవీ పద్మావతి.. వైసీపీ కోసం ఇంత చేస్తున్నారా?

RTO Padmavati:ఎన్టీఆర్ కృష్ణ జిల్లాలలో ప్రధాన పార్టీ అభ్యర్థుల నామినేషన్ పరిశీలన ప్రక్రియ తీవ్రస్థాయిలో ఉత్కంఠత నెలకొంది. ముఖ్యంగా గుడివాడ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి కొడాలి నాని నామినేషన్ విషయంలో తీవ్రస్థాయిలో...
- Advertisement -
- Advertisement -