Kerala: ఆరోజే కేరళకు రుతు పవనాలు.. రైతులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ఇదే!

Kerala: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా కర్ణాటక, కేరళ, తమిళనాడు లాంటి ప్రదేశాలలో ఒకవైపు ఎండలు మండిపోతున్న మరొకవైపు వేడి గాలులు,వర్షాలు, వడగండ్ల వానలు పడుతున్నాయి. ఉన్నటువంటి ఒక్కసారిగా వాతావరణం పరిస్థితులు మారిపోతున్నాయి. కాగా మొన్నటి వరకు వరుసగా వర్షాలు పడిన విషయం తెలిసిందే. ఎక్కడ చూసినా కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో ఇది ఎండాకాలమా లేదా వర్షాకాలమా అన్న అనుమానాలు రేకెత్తాయి. మొన్నటి వరకు పరిస్థితి అది.

కానీ ఇప్పుడు మాత్రం ఎండలు మండిపోతున్నాయి. ఎక్కడ కూడా వర్షాలు పడే సూచనలు కూడా కనిపించడం లేదు. ఇది ఇలా ఉంటే తాజాగా భారత వాతావరణ శాఖ రైతులకు ఒక చక్కని శుభవార్తను అందించింది. అదేమిటంటే ఈ ఏడాది నాలుగు రోజులు ఆలస్యంగా భారత్‌ను నైరుతి రుతు పవనాలు పలుకరించనున్నాయి. జూన్‌ 4న ఈ పవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశముందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. భారతదేశంలో ఈ ఏడాది సాధారణ వర్షపాతం 83.5 సెం.మీ దాకా నమోదు కావొచ్చని ఐఎండీ తెలిపింది. ఎల్‌ నినో పరిస్థితులు ఉన్నప్పటికీ దేశమంతటా సాధారణ వర్షపాతం ఆశించవచ్చని వెల్లడించింది.

 

అయితే సాధారణంగా ఏటా జూన్‌ 1న ఈ రుతు పవనాలు కేరళ తీరాన్ని తాకుతాయి. కాగా, గత ఐదు ఏళ్లలో ఏర్పడ్డ వాతావరణ పరిస్థితుల కారణంగా గత. ఏడాది మాత్రమే రుతుపవనాలు పలకరించాయి. భారతదేశ వ్యవసాయ రంగానికి కీలకమైన నైరుతి రుతు పవనాలు. ఈ ఏడాది సకాలంలో రానున్నాయని ఐఎండీ ప్రకటించడం పై రైతు సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. కాగా 2019 రుతుపవనాల సీజన్‌లో 971.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, 2020లో 961.4 మిల్లీ మీటర్ల వర్షపాతం కురిసింది. 2021లో 874.5 మిల్లీ మీటర్లు, 2022లో 924.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయినట్లు ఐఎండీ డైరెక్టర్‌ జనరల్‌ మహాపాత్ర వెల్లడించారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -