Kerala: భర్త ఎఫైర్ ని కనిపెట్టిన ట్రాఫిక్ చలానా.. చివరికి?

Kerala: ఇటీవల కాలంలో వివాహేతర సంబంధాల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఎక్కడ చూసినా కూడా ఈ వివాహేతర సంబంధాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో ఈ వివాహేతర సంబంధాల కోసం మనుషులు మానవత్వం అన్న మాటను మరిచి భర్త భార్యను చంపడం, భార్యాభర్తలను చంపడం లాంటి ఘటనలు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. వివాహేతర సంబంధాల మోజులో పడి చాలామంది వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఈ వివాహేతర సంబంధాల కోసం భార్యాభర్తలు ప్రాణాలు ఒకరి తీసుకొని పిల్లలను అనాధలుగా మారుస్తున్నారు.

ఇది ఇలా ఉంటే తాజాగా అలాంటి వివాహేతర సంబంధం ఒకటి వెలుగులోకి రావడంతో అతడు కటకటాల పాలయ్యాడు. వివాహేతర సంబంధాన్ని బయటపెట్టింది ట్రాఫిక్ చలానా.అదెలా అనుకుంటున్నారా. పూర్తి వివరాల్లోకి వెళితే..ఈ ఘటన కేరళలోని తిరువనంతపురంలో చోటు చేసుకుంది. ఏప్రిల్ 25న ఒక వ్యక్తి తన స్కూటీపై ఒక మహిళను ఎక్కించుకుని వెళ్తున్నాడు. అయితే హెల్మెట్ ధరించలేదు. దాంతో రోడ్డు మీద ఉన్న ఏఐ కెమెరాలు ఫోటోలను తీశాయి. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన కారణంగా చలానా అతని భార్య ఫోన్ కి వెళ్ళింది. ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడ్డాడని మెసేజుతో పాటు ఫోటోని కూడా ఆ వ్యక్తి భార్య ఫోన్ కి పంపించారు ట్రాఫిక్ పోలీసులు.

 

స్కూటీ ఆమె పేరు మీదే రిజిస్టర్ అయి ఉంది. భర్త వేరే మహిళతో ఉన్న ఫోటోను చూసి ఆమెకు చిర్రెత్తుకొచ్చింది. వెంటనే భర్తను ఎవరా ఊహ అంటూ నిలదీసింది. కానీ భర్త మాత్రం ఆమె ఎవరో తనకు తెలియదని లిఫ్ట్ అడిగితే ఇచ్చానని చెప్పాడు. కానీ భార్య నమ్మలేదు. అతనితో వాగ్వాదానికి దిగింది. తన భర్త ఆ ఫోటోలో ఉన్న మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతో ప్రతి రోజు గొడవపడేది. ఇటీవలె ఆమె ఈ విషయం గురించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేసింది. తనను శారీరకంగా హింసించడంతో పాటు తన మూడేళ్ల కూతురిని కూడా వేధించాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. దీనికి సంబంధించి ఆధారాలు లేకపోయినా పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. 321, 341, 294, 75 సెక్షన్ల కింద అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. అయితే ఆ వ్యక్తి స్కూటీ ఎక్కిన మహిళ ఎవరు అన్న విషయాన్ని పోలీసులు గుర్తించలేకపోయారు. ఆమెతో వివాహేతర సంబంధం ఉందా? లేక అతను చెప్తున్నట్లు లిఫ్ట్ మాత్రమే ఇచ్చాడా? అన్నది తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -