Kerala: భర్త పిల్లలను కాదని.. ప్రియుడి కోసం బ్యూటీషియన్ ఏం చేసిందంటే?

Kerala: ఈ మధ్యకాలంలో చాలామంది భార్యాభర్తలు వివాహేతర సంబంధాల మోజులో పడి పచ్చని సంసారాలను నాశనం చేసుకుంటున్నారు. కొంతమంది భార్య వివాహేతర సంబంధాల కోసం తాళి కట్టిన భర్తను చంపడానికి కూడా వెనుకాడడం లేదు. అలాగే పురుషులు కూడా ఇతర మహిళల కోసం భార్యలను చంపడానికి వెనకాడడం లేదు. తాజాగా ఒక మహిళ భర్త పిల్లలను కాదని ఒక దారుణానికి ఒడిగట్టింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కేరళ రాష్ట్రం ఉడ్మ పరిధిలోని ముక్కునోత్ గ్రామంలో దేవిక అనే 34 ఏళ్ళ మహిళ నివాసం ఉంటుంది. అదే ప్రాంతానికి చెందిన వ్యక్తితో ఆమెకి గతంలో వివాహం జరిగింది.

పెళ్లైన కొంత కాలానికి ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. అలా కొంత కాలం తర్వాత స్థానిక పట్టణ కేంద్రంలో బ్యూటీషియన్ గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంది. ఈ క్రమంలోనే దేవికకు ముల్లియూర్ పరిధిలోని బోవికానం గ్రామానికి చెందిన సతీష్ అనే 36 ఏళ్ళ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయమే రాను రాను ఇద్దరి మధ్య వివాహేతర సంబందానికి దారితీసింది. ఇక సమయం దొరికినప్పుడల్లా ఇద్దరు ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే దేవికకు ఆమె భర్తతో గొడవలు జరిగాయి. దీంతో ఆమెకు భర్తతో ఉండడం ఇష్టం లేక పిల్లలతో పాటు భర్తకు దూరంగా ఉంటుంది. దేవిక ఎప్పటి నుంచో తన ప్రియుడు సతీష్ ని పెళ్లి చేసుకోవాలని కోరింది.

 

దీనికి సతీష్ నిరాకరిస్తూ వచ్చాడు. దేవిక పట్టుబట్టడంతో పాటు రాను రాను సతీష్ ను మరింత టార్చర్ పెట్టింది. దీంతో ఆమె ప్రియుడు ఎలాగైన దేవికను హత్య చేయాలని అనుకున్నాడు. ఇందులో భాగంగానే దేవిక ఇటీవల బార్బర్, బ్యూటీషియన్ యూనియన్ జిల్లా సమావేశాలకు హాజరైంది. ఈ సమావేశానికి ఆమెతో పాటు ప్రియుడు సతీష్ కూడా వెంట వెళ్లాడు. సమావేశం అనంతరం ఇద్దరు కలిసి కేరళలోని కాసర్ గోడ్ పరిధిలోని ఒక లాడ్జికి వెళ్లారు. ఇక అందులోకి వెళ్లాక ఆమె ప్రియుడు దేవికను గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. అనంతరం ఆ గదికి తాళం వేసి నేరుగా పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఇక నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు లాడ్జిలో ఉన్న దేవిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -