Bangalore: తెల్లగా ఉందని జాబ్ ఇవ్వలేదు.. యువతి ఆవేదన వింటే షాకవ్వాల్సిందే!

Bangalore: మనం ఏదైనా ఒక కంపెనీకి ఇంటర్వ్యూ కి వెళ్ళినప్పుడు రకరకాల కారణాల వల్ల రిజెక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువ శాతం ఉద్యోగాలు టాలెంటు ప్రతిభను చూసి ఇస్తూ ఉంటారు. కానీ బెంగళూరులో మాత్రం ఒక యువతి తెల్లగా ఉంది అన్న కారణంతో కంపెనీ ఆమెను రిజెక్ట్ చేసింది. వినడానికి కాస్త విడ్డూరంగా ఉన్న ఇది నిజం. ఈ విషయాన్ని సదరు యువతీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. అసలేం జరిగిందంటే.. బెంగళూరులో ఒక సంస్థ ఉద్యోగ ప్రకటన చూసి ప్రతీక్ష జిక్కర్ అనే యువతి అప్లై చేసుకుంది.

కంపెనీ నిర్వహించిన పరీక్షలో విజయం పొందింది. ఆ తరువాత జరిగిన మూడు రౌండ్లను కూడా ఆమె పూర్తి చేసింది. అయితే చివరికి కంపెనీ మాత్రం ఈమెను రిజెక్ట్ చేసింది. దీనికి ప్రధాన కారణం ఆమె తెల్లగా ఉండటమే అని సంస్థ తెలిపింది. కంపెనీ పంపిన మెయిల్‌లో మేము మీ ప్రొఫైల్ చూసాము, ఉద్యోగానికి కావాల్సిన అన్ని అర్హతలు మీకు ఉన్నాయి, కానీ మా మొత్తం టీమ్‌లోని ఇతర సభ్యులకంటే తెల్లగా ఉండటం వల్ల మిమ్మల్ని రిజెక్ట్ చేస్తున్నామని తెలిపింది. దాంతో ఆ విషయాన్ని ప్రతీక్ష జిక్కర్ లింక్డ్ ఇన్‌లో పోస్ట్ చేసింది. నిజానికి కంపెనీ మెయిల్ చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాను.

 

మనిషి రంగును బట్టి కూడా ఉద్యోగం ఇవ్వడం జరుగుతుందని నేను ఊహించలేదు. మనిషి కలర్ కాకుండా ప్రతిభను బట్టి ఉద్యోగం ఇవ్వాలని కంపెనీని కోరుతూ పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ చూసిన చాలామంది తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. ఆ పోస్ట్ ని చూసిన నెటిజన్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందిస్తున్నారు. సదరు కంపెనీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి సదరు కంపెనీ ఆమె రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేసి ఉద్యోగం ఇస్తుందా లేదా అన్నది చూడాలి మరి..

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -