Samantha-Siddharth: సమంత, సిద్ధార్థ్ విడిపోక ముందు ఇంత పెద్ద కథ నడిచిందా?

Samantha-Siddharth: టాలీవుడ్ ప్రపంచానికి సమంత గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఏ మాయ చేసావే సినిమా ద్వారా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి నటనలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఇక తన అందం తో ఎంతోమంది అభిమానులను ఆకట్టుకుంది. మొత్తానికి ఈ అమ్మడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఇలా స్టార్ హీరోయిన్ గా కెరీర్ పరంగా దూసుకుపోతున్న క్రమంలో అక్కినేని వారసుడు చైతూ ని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత వీరిద్దరి మధ్య ఎటువంటి మనస్పర్ధలు వచ్చాయో కానీ వీళ్ళిద్దరూ విడిపోయారు. ఇక సమంత తన మాజీ లవర్ సిద్ధార్థ్ తో కలిసి జబర్దస్త్ అనే సినిమా తీసిన విషయం మనకు తెలుసిందే. ఆ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. అంతేకాకుండా శ్రీకాళహస్తిలో రాహు కేతువు పూజలు కూడా ఈ జంట కలిసి చేశారు.

అప్పట్లో ఈ పూజలు చాలా సంచలనానికి దారి తీసాయి. అందరూ వీరి ప్రేమ పెళ్లి పీటల వరకు వస్తుంది అనుకున్నారు. కానీ మధ్యలోనే వీరి బంధానికి పుల్ స్టాప్ పెట్టారు. అప్పట్లో వీళ్ళిద్దరూ కలిసి నటించిన జబర్దస్త్ సినిమా ఎన్నో వివాదాలకు దారితీసింది. నందినీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకి బెల్లంకొండ సురేష్ నిర్మాతగా వహించాడు. ఇక ఈ సినిమా విడుదల చేసిన తర్వాత బాలీవుడ్ మూవీ బ్యాండ్ బాజా బ‌రాత్ ను కాపీ కొట్టారు అంటూ.. నందిని రెడ్డి ని ఏకిపారేశారు.

అంతేకాకుండా బాలీవుడ్ నిర్మాతలు కోర్టుకు కూడా వెళ్లారు. చివరకు కోర్టు కూడా ఈ సినిమాను టీవీల్లో.. డీవీడీ లో ప్రచారం చేయవద్దని తీర్పు చెప్పింది. ఆ తర్వాత నిర్మాత బెల్లంకొండ సురేష్ ఈ విషయాన్ని హ్యాండిల్ చేసుకున్నాడు. మొత్తానికి సమంత సిద్ధార్థ జంటలు విడిపోవడానికి ముందు చాలా రకాల వివాదాలు జరిగాయి. ప్రస్తుతం సమంత విజయ్ దేవరకొండ తో కలిసి ఖుషి సినిమా లో నటిస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -