Actress Pakeezah Vasuki: ప్రముఖ నటి పాకీజాకు ఇలాంటి పరిస్థితా?

Actress Pakeezah Vasuki: సినీ ఇండస్ట్రీలో ఎవ్వరి జీవితం ఎలా ఉంటుందో ఎప్పుడు ఏమవుతుందో చెప్పలేం. ఒకప్పట్లో చేతినిండా సినిమాలు చేసినవారు ఆ తర్వాత దీన స్థితిని అనుభవిస్తున్న సంఘటను ఉన్నాయి. ఈ మధ్యకాలంలో సినీ ప్రముఖులు ఒక్కొక్కరుగా తమ దీనస్థితిని పలు ఇంటర్వ్యూలలో చెబుతూ వస్తున్నారు. ఎప్పుడో సినిమాలు వదిలేసినప్పటికీ, ఇన్నాళ్లు ఏమైపోయారు అనేది ఎవరికీ తెలియని విషయమే అయినా సినిమాలు మానేశాక లేకుంటే అవకాశాలు లేక తమ జీవితాన్ని ఎలా నెట్టుకొస్తున్నారో చూస్తే మాత్రం కంటనీరు ఆగక మానదు.

 

కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులుగా వందల సినిమాలు చేసి కూడా చివరికి తిండిలేక పూట గడవడమే కష్టంగా మారిపోయి దయనీయ స్థితికి చేరుకున్నారు. ఈ మధ్యకాలంలో చాలామంది సీనియర్ నటులను దీనస్థితిలో చూసిన సందర్భాలు ఉన్నాయి. అదే వరుసలో ఇప్పుడు మరో నటి దీనగాథ వెలుగు చూసింది. సీనియర్ నటి పాకీజా అలియాస్ వాసుకి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 1980-90 మధ్య ఈమె సినిమాలు అందర్నీ అలరించాయి. తమిళ, తెలుగు ఇండస్ట్రీలలో ఎన్నో వందల సినిమాల్లో ఈమె నటించి మెప్పించింది. అయితే సినిమాలలో తనకు గుర్తింపు తెచ్చిన క్యారెక్టర్స్ పోషించిన పాకీజా ఇప్పుడు తిండిలేక దయనీయ స్థితిలో ఉంది.

 

నటి పాకీజా చాలా సంవత్సరాలుగా ఇండస్ట్రీకి, సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే ఆమె చేసిన సినిమాల ద్వారా సంపాదించిన మొత్తాన్ని పోగొట్టుకుని తనకంటూ ఏమి లేకుండా మిగిలిపోయింది. తెలుగులో అసెంబ్లీ రౌడీ సినిమాలో ఆమె చేసిన పాకీజా రోల్ ఎంతో పాపులర్ అయ్యింది. దీంతో ఆ సినిమా తర్వాత పెదరాయుడు, రౌడీ ఇన్స్పెక్టర్ లాంటి చాలా సినిమాలలో నటించి మెప్పించింది. అందరి స్టార్స్ తో సినిమాలు చేసి తెలుగులోనే దాదాపు 50 సినిమాల్లో కనిపించింది.

 

ప్రస్తుతం ఈమె పరిస్థితి దారుణంగా ఉంది. తాజాగా ఓ వీధిలో నడుచుకుంటూ వెళ్తున్న పాకీజా తన లైఫ్ లో జరిగిన విశేషాలను, తనకు ఇంతటి దుస్థితి రావడానికి కారణాలు తెలియజేసింది. లేడీ కమెడియన్ గా ఎంతో మంచి పేరు తెచ్చుకున్నా ఆమె ఆస్తిపాస్తులేమీ సంపాదించలేదు. ప్రస్తుతం పాకీజాకి సంబంధించి తాజా ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తనకు సహాయం కోసం తమిళ నడిగర్ సంఘంతో పాటు అందరు హీరోలను ఆమె సంప్రదించానని తెలిపింది. ఆఖరికి సీఎం కుమారుడు ఉదయనిధి స్టాలిన్ కి కలిసి తన పరిస్థితిని తెలిపినట్లు వివరించింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -